Rana : స్థలం వివాదంపై కోర్టుకు హాజరైన దగ్గుబాటి రానా.. విచారణ వాయిదా..
ఫిలింనగర్ లోని ఓ స్థలం వివాదంపై గురువారం ఉదయం సిటీ సివిల్ కోర్ట్ కి హీరో దగ్గుబాటి రానా హాజరయ్యారు. గతంలో ఫిలింనగర్లో 2200 గజాల స్థలం అలనాటి నటి మాధవిలత దగ్గర నుండి.........

Rana
Suresh Babu : ఫిలింనగర్ లోని ఓ స్థలం వివాదంపై గురువారం ఉదయం సిటీ సివిల్ కోర్ట్ కి హీరో దగ్గుబాటి రానా హాజరయ్యారు. గతంలో ఫిలింనగర్లో 2200 గజాల స్థలం అలనాటి నటి మాధవిలత దగ్గర నుండి దగ్గుపాటి కుటుంబం కొనుగోలు చేసింది. హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు కలిసి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2014లో ఈ స్థలాన్ని నగరంలో ఉన్న ఓ వ్యాపారికి లీజుకి అగ్రిమెంట్ చేశారు సురేష్ బాబు. ఆ తర్వాత లీజ్ అగ్రిమెంట్ ని 2016లో, 2018లో కూడా రెన్యూవల్ చేయించుకున్నారు. అయితే లీజ్ అగ్రిమెంట్ ఇంకా కొనసాగుతుండగానే ఆ ప్రాపర్టీని అమ్మకానికి పెట్టారు సురేష్ బాబు.
దీంతో ఆ ప్రాపర్టీ తానే కొనుగోలు చేస్తానని లీజుకి తీసుకున్న వ్యాపారి 3 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు సురేష్ బాబుకి. ఆ తర్వాత ఎక్కువ రేటు రావడంతో ఇదే ప్రాపర్టీని 6 కోట్లు క్యాష్ తీసుకొని ప్రమోద్ అనే అతనికి సురేష్ బాబు అమ్మేశారు. దీంతో ఆ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. దీంతో స్థలం వివాదంలో ఎవ్వరు జోక్యం చేసుకోవద్దని నందుకు అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ జారీ చేసింది. కోర్టులో ఈ వివాదం కొనసాగుతుండగానే తన కొడుకు దగ్గుబాటి రానా పేరు మీద ఆ స్థలంలోని 1000 గజాల స్థలంను రిజిస్ట్రేషన్ చేపించారు సురేష్ బాబు.
Aamir Khan : లాల్ సింగ్ చద్దా కోసం మెగా ప్రివ్యూ.. అమీర్ ఖాన్ కోసం టాలీవుడ్..
దీంతో లీజ్ పిరీడ్, సేల్ డీడ్ ఉండగా మళ్ళీ రానా పేరు మీద అగ్రిమెంట్ ఎలా చేస్తారని కోర్టుకు వెళ్లారు. కోర్టులో పెండింగ్ ఉండగా కోర్టు ధిక్కరణ చేసిన దగ్గుబాటి సురేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాడు వ్యాపారి నందు. దీంతో న్యాయస్థానం దగ్గుబాటి రానాకి నోటీసులు జారీ చేయడంతో గురువారం ఉదయం కోర్టుకి హాజరయ్యారు రానా. ఇవాళ్టి విచారణ అనంతరం తదుపరి విచారణని ఈ నెల 19కి వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్ట్.