రానా న్యూ లుక్ చూసి షాక‌వుతున్న ఫ్యాన్స్!

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 10:55 AM IST
రానా న్యూ లుక్ చూసి షాక‌వుతున్న ఫ్యాన్స్!

Updated On : April 25, 2019 / 10:55 AM IST

సౌత్ నార్త్‌ తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటిన స్టార్ వారసుడు రానా… బాహుబ‌లి చిత్రంతో తన క్రేజ్ ఏ రేంజ్‌కి పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే బాహుబ‌లి చిత్రంలో భారీ పర్సనాలిటీతో క‌నిపించిన రానా ఆ త‌ర్వాత వివిధ గెట‌ప్స్‌లో క‌నిపించాడు. ఒక‌సారి స‌న్న‌గా ,మ‌రోసారి గడ్డం లేకుండా క్లీన్ షేవ్‌లో, ఇంకో సారి భారీ గ‌డ్డంతో ప‌లు గెట‌ప్స్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. 

తాజాగా రానా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కం‍టపడ్డాడు. ఈ ఫోటోల్లో రానా లుక్‌ పై మరోసారి చర్చకు దారి తీస్తోంది. అందులో స‌న్న‌గా, భారీ గ‌డ్డంతో క‌నిపించాడు. రానా లుక్‌కి సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

అయితే బాగా సన్నబడ్డ రానాను చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. రానా ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న ఇలా మారాడా లేక ప్ర‌స్తుతం న‌టిస్తున్న‌ హాథీ మేరే సాథీ సినిమా కోసం అలా మారాడా అన్న‌ది తెలియాల్సి ఉంది. మ‌రి ఈ వార్తలపై రానా ఎప్పుడు స్పందిస్తాడో..? ఎలా స్పందిస్తాడో అనేది చూడాలి.