‘1945’ ఫస్ట్ లుక్ – ఆ నిర్మాతను నమ్మొద్దు : రానా సెన్సేషనల్ కామెంట్స్

రానా దగ్గుబాటి నటిస్తున్న ‘1945’ సినిమా విషయంలో రానా, నిర్మాత మధ్య సోషల్ మీడియా ద్వారా మాటల యుద్ధం జరుగుతోంది..

  • Published By: sekhar ,Published On : October 28, 2019 / 08:02 AM IST
‘1945’ ఫస్ట్ లుక్ – ఆ నిర్మాతను నమ్మొద్దు : రానా సెన్సేషనల్ కామెంట్స్

Updated On : October 28, 2019 / 8:02 AM IST

రానా దగ్గుబాటి నటిస్తున్న ‘1945’ సినిమా విషయంలో రానా, నిర్మాత మధ్య సోషల్ మీడియా ద్వారా మాటల యుద్ధం జరుగుతోంది..

రానా దగ్గుబాటి నటిస్తున్న ‘1945’ ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా దర్శకుడు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఈ సినిమా గురించి రానా సెన్సేషనల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.. శివకుమార్ దర్శకత్వంలో, రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కుతున్న ‘1945’లో రానా సైనికుడిగా కనిపించబోతున్నాడు.

‘దాదాపు మూడు సంవత్సరాల తర్వాత నా సినిమా పూర్తయింది.. దీపావళి నాడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది.. దేశభక్తి, ఓ ఐఏఎన్ ప్రేమ అనే ఎమోషన్స్ మధ్య జరిగే యుద్ధమే ‘1945’ అంటూ దర్శకుడు ట్వీట్ చేశాడు.. ఈ ట్వీట్ గురించి రానా స్పందిస్తూ.. ‘1945’ సినిమా ఇంకా పూర్తి కాలేదు. నేను ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌ను క‌లిసి సంవత్సరం పైనే అయింది. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో వ‌చ్చిన మాట తేడా వ‌ల్ల నేను సినిమాను పూర్తి చేయ‌లేదు. మార్కెట్ నుండి డ‌బ్బును రాబ‌ట్టుకోవ‌డానికి, సినిమాని బిజినెస్ చేసుకోవడానికి నిర్మాత అంద‌రినీ మోసం చేస్తున్నాడు. ఆయ‌న్ని న‌మ్మొద్దు’ అంటూ ట్వీట్ చేశాడు.

Read Also : ‘రాములో రాములా’ : రచ్చ చేస్తున్న టిక్‌టాక్ వీడియో!

రానా ట్వీట్‌కి బదులుగా నిర్మాత రాజ‌రాజ‌న్ స్పందిస్తూ..‘సినిమా పూర్త‌య్యిందా? లేదా? అని డైరెక్ట‌ర్ మాత్ర‌మే డిసైడ్ చేస్తాడు.. 60 రోజుల పాటు షూటింగ్‌ చేసి, కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశాం. పూర్తి అవని సినిమాను ఎవ‌రూ రిలీజ్ చేయాల‌ని అనుకోరు’ అని ట్వీట్ చేశాడు..