Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా.. క్లారిటీ ఇచ్చిన భార్య మిహికా!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రానా గతేడాది కరోనా లాక్‌డౌన్ సమయంలో మనసిచ్చి మెచ్చిన స్నేహితురాలు, ప్రేమికురాలు..

Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా.. క్లారిటీ ఇచ్చిన భార్య మిహికా!

Rana Daggubati

Updated On : April 1, 2022 / 8:58 AM IST

Rana Daggubati: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రానా గతేడాది కరోనా లాక్‌డౌన్ సమయంలో మనసిచ్చి మెచ్చిన స్నేహితురాలు, ప్రేమికురాలు మిహికా బజాజ్ ను వివాహమాడి ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షలలోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగగా.. ప్రస్తుతం ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Rana Daggubati : భళ్లాలదేవ క్రేజ్‌ని ‘బీమ్లా నాయక్’ ఎందుకు వాడట్లేదు??

దీనికి కారణం ఇటీవల ఓ పెళ్లి వేడుకలో రానా-మిహికా దంపతులు సందడి చేయగా.. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. సహజంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిహికా తరచుగా వాళ్ళ సంతోష క్షణాలను.. రానా మూవీ అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అలాగే ఓ పెళ్లి వేడుకకు వెళ్తుండగా.. పెళ్లి వేడుక నుండి కూడా ఫోటోలు షేర్ చేసుకుంది.

Rana Daggubati : ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు.. విప్లవ గీతం వినిపిస్తున్న రానా

అయితే ఈ ఫోటోల్లో మిహికా కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో తల్లి కాబోతున్న మిహికా అనే ప్రచారం మొదలైంది. తాజాగా మిహికా నెటిజన్లతో చిట్ చాట్ లో కూడా అదే ప్రశ్న ఎదురైంది. మీరు తల్లి కాబోతున్నారా అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి సమాధానంగా మిహికా అలాంటిదేమి లేదు.. ఇది పెళ్లి తరువాత వచ్చే మార్పు మాత్రమే అని బదులిచ్చింది. దీంతో రానా తండ్రి కాబోతున్నాడన్న వార్తలకు ఇప్పటికైతే ఫుల్‌స్టాఫ్ పడినట్టు అయ్యింది. మరి భల్లాలదేవ శుభవార్త ఎప్పుడు చెప్తాడా అని వెయిట్ చేస్తున్న ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో చూడాలి.