Ranbir Kapoor : పఠాన్ కలెక్షన్స్ చూడలేదా అంటూ BBC రైడ్స్ పై కౌంటర్ వేసిన రణబీర్ కపూర్..
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ త్వరలో తూ జూఠీ మెయిన్ మక్కార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు రణబీర్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ఈ ప్రెస్ మీట్ లో ఓ మహిళా జర్నలిస్ట్..............

Ranbir Kapoor counter to BBC Journalist
Ranbir Kapoor : గత సంవత్సరకాలంగా దీనస్థితిలో ఉన్న బాలీవుడ్ ని పఠాన్ సినిమా ఆడుకుంది. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయం సాధించి పఠాన్ సినిమాతో బాలీవుడ్ కి ఊపిరి పోశారు. దీంతో బాలీవుడ్ అంతా ఫుల్ జోష్ లోకి వచ్చి తమ సినిమాలు కూడా హిట్ అవుతాయి అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా పఠాన్ ని చూసి ధైర్యంతో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ త్వరలో తూ జూఠీ మెయిన్ మక్కార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు రణబీర్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ఈ ప్రెస్ మీట్ లో ఓ మహిళా జర్నలిస్ట్.. బాలీవుడ్ ఇంకా డల్ గానే ఉంది కదా అంటూ అడుగుతుండటంతో రణబీర్.. ఏం మాట్లాడుతున్నారు మీరు, పఠాన్ కలెక్షన్స్ చూడలేదా అని అన్నాడు. వెంటనే మళ్ళీ మీరు ఏ సంస్థ నుంచి వచ్చారు అని అడగగా ఆమె.. BBC అని చెప్పింది. దీంతో రణబీర్.. మీ ఆఫీస్ లో ఏం జరుగుతుంది, బయటకి చెప్తున్నారా? ఏదో జరుగుతుంది, దాని గురించి ముందు మీరు చెప్పండి అంటూ ఇటీవల BBCపై జరిగిన ఐటీ రైడ్స్ ని ఉద్దేశిస్తూ కౌంటర్ వేశాడు.
Raashii Khanna : షారుఖ్‌ని దాటి మరీ ఆ లిస్ట్‌లో టాప్ 1 గా నిలిచిన రాశీఖన్నా..
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. బాలీవుడ్ ప్రేక్షకులు BBC కి కౌంటర్ పడింది అంటూ వీడియోని షేర్ చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు.
Actor #RanbirKapoor Trolled BBC ??????? pic.twitter.com/PBu7g5K2HH
— Narendra Modi fan (@narendramodi177) February 22, 2023