Thalaivar 171 : రజినీకాంత్ కోసం రణ్‌వీర్‌ని తీసుకు వస్తున్న లోకేష్ కనగరాజ్.. నిజమేనా..!
షారుఖ్ ఖాన్ నో చెప్పడంతో రజినీకాంత్ కోసం రణ్‌వీర్‌ని తీసుకు వస్తున్న లోకేష్ కనగరాజ్. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త నిజమేనా..?

ranveer Singh is in talks for important role in Rajinikanth Thalaivar 171
Thalaivar 171 : జైలర్ సినిమాతో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చిన రజినీకాంత్.. ప్రస్తుతం TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టియాన్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 171వ సినిమాని చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఆ ఫస్ట్ లుక్ తో వింటేజ్ రజినిని గుర్తుకు చేసారు. దీంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఉంటుందట. ఆ రోల్ కూడా రజిని పాత్రలా చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందని సమాచారం. దీంతో ఆ పాత్రని ఓ స్టార్ హీరోతో చేయించాలని లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈక్రమంలోనే ఆ పాత్ర కోసం షారుఖ్ ఖాన్ ని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ ఆఫర్ ని షారుఖ్ చాలా సున్నితంగా తిరస్కరించారని వార్తలు వినిపించాయి.
Also read : Thandel : నాగచైతన్య సినిమా కోసం రంగంలోకి దిగిన యానిమల్ మేకర్స్.. ఈపాలి ఏట గురితప్పేదేలే..
అయితే ఇప్పుడు అదే పాత్రని రణ్‌వీర్ సింగ్ తో చేయించాలని లోకేష్ భావిస్తున్నారట. ఈక్రమంలోనే రణ్‌వీర్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. మరి రణ్‌వీర్ అయినా ఆ పాత్రకి ఓకే చెబుతారా లేదా చూడాలి. కాగా ఈ మూవీ టైటిల్ ని ఈ నెల 22న రివీల్ చేస్తామంటూ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. మరి ఈ యాంటిసిపేటెడ్ మూవీకి లోకేష్ ఎలాంటి టైటిల్ ని అనౌన్స్ చేస్తారో చూడాలి.
ఈ సినిమాని కూడా ఆ రోజే గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. కాగా ఈ మూవీ విషయంలో అభిమానుల్లో ఓ సందేహం నెలకుంది. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఓ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. ఈ సినిమాని కూడా ఆ యూనివర్స్ లోనే తీసుకు రాబోతున్నారు అనే డౌట్ నెలకుంది. మరి దీని పై ఓ క్లారిటీ రావాలంటే వేచి చూడాలి.