Rashmi Gautam : సారీ చెప్పాలంటూ నాగశౌర్య.. ఇంకో సూసైడ్ చూడాలి అనుకుంటున్నారా అంటున్న రష్మీ!

టాలీవుడ్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. సొసైటీలో జరిగే కొన్ని సంఘటనలను ప్రశ్నిస్తూ ట్వీట్ లు చేస్తుంటుంది. తాజాగా ఇటీవల హీరో నాగశౌర్య చేసిన ఒక పని పై ఈ అమ్మడు స్పందించింది.

Rashmi Gautam : సారీ చెప్పాలంటూ నాగశౌర్య.. ఇంకో సూసైడ్ చూడాలి అనుకుంటున్నారా అంటున్న రష్మీ!

Rashmi Gautam tweet on Naga Shaurya recent incident

Updated On : March 3, 2023 / 11:55 AM IST

Rashmi Gautam : టాలీవుడ్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. సొసైటీలో జరిగే కొన్ని సంఘటనలను ప్రశ్నిస్తూ ట్వీట్ లు చేస్తుంటుంది. తాజాగా ఇటీవల హీరో నాగశౌర్య చేసిన ఒక పని పై ఈ అమ్మడు స్పందించింది. ఫిబ్రవరి 28న కారులో వెళుతున్న నాగశౌర్యకు నడిరోడ్డు పై ఒక అబ్బాయి ఒక అమ్మాయి పై చెయ్యి చేసుకోవడం కనిపించింది. దీంతో వెంటనే కారు దిగి ఆమె పై ఎందుకు చెయ్యి చేసుకున్నావు అంటూ ఆ కుర్రాడిని నిలదీశాడు. దానికి ఆ కుర్రాడు.. ఆమె నా లవర్ నా ఇష్టం అన్నట్లు బదులిచ్చాడు. దీంతో నాగశౌర్య ఆ కుర్రాడితో ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేశాడు.

Naga Shaurya : నడిరోడ్డులో యువతి పై చెయ్యి చేసుకున్న వ్యక్తిని నిలదీసిన హీరో నాగశౌర్య..

ఆ సమయంలో ఒకరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజెన్లు నాగశౌర్యని ప్రశంసిస్తుంటే, మరి కొందరు మాత్రం.. లవర్స్ మధ్య వంద ఉంటాయి. వాటిని కెలకడం అవసరమా? వాడి లవర్ వాడి ఇష్టం మధ్యలో వీడికి ఏంటి? అసలు ఆ అమ్మాయి ఏమి తప్పు చేసిందో? అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ కామెంట్లు చూసిన రష్మి.. కింద కామెంట్స్ చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. ఆ అమ్మాయి ఎటువంటి ఒత్తిడికి లోనవుతుందో ఎవరికి తెలుసు. ఇంకో సూసైడ్ చూడాలి అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. ఇటీవల జరిగిన మెడికల్ స్టూడెంట్ ప్రీతీ ఆత్మహత్యని దృష్టిలో పెట్టుకొని రష్మీ ఇటువంటి కామెంట్స్ చేసింది. రష్మీ ట్వీట్ పై కూడా నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.