Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియోపై సెలబ్రిటీలు సీరియస్.. తనకి సపోర్ట్ చేస్తున్నందుకు రష్మిక రియాక్షన్..

ఇప్పటికే రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, ఓ కేంద్ర మంత్రి, ఎమ్మల్సీ కవిత.. పలువురు స్పందించారు. రష్మిక కూడా దీనిపై స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.

Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియోపై సెలబ్రిటీలు సీరియస్.. తనకి సపోర్ట్ చేస్తున్నందుకు రష్మిక రియాక్షన్..

Rashmika Fake video Goes Viral Celebrities Serious Reaction

Updated On : November 7, 2023 / 9:13 AM IST

Rashmika Mandanna : గత రెండు రోజుల నుంచి రష్మికకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొదట అభిమానులు, నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ఇది AI యూజ్ చేసి ఫేక్ వీడియో సృష్టించారు అని తెలియడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రష్మికకు మద్దతుగా నిలుస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇప్పటికే రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, ఓ కేంద్ర మంత్రి, ఎమ్మల్సీ కవిత.. పలువురు స్పందించారు. రష్మిక కూడా దీనిపై స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. దీంతో నిన్నంతా రష్మిక ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. రష్మికకు సపోర్ట్ గా.. నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, సాయి ధరమ్ తేజ్ .. పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ టెక్నాలజీని ఇలా చెడుకు వినియోగిస్తున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, టెక్నాలజీ మిస్ యూజ్ అవ్వకుండా చూడాలని కోరుతూ ట్వీట్స్ చేశారు.

Also Read : Bigg Boss 7 Day 64 : ఈ సారి నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? బిగ్‌బాస్ మహారాజ్యంలో సరికొత్తగా నామినేషన్స్ ప్రక్రియ..

తనకి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్న వారి ట్వీట్స్ ని రష్మిక రీ షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పింది. ఇంతమంది ఇలాంటి సమయంలో నా కోసం నిలుచున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది.