Rashmika Mandanna : నాకు రిలేషన్ గురించి ఆలోచించేంత ఖాళీ లేదు.. విజయ్,నేను క్లోజ్‌గా ఉంటాం అయితే??

రష్మిక మాట్లాడుతూ.. ''నేను హీరోయిన్ ని కాబట్టి అందరూ నా గురించి తెలుసుకోవాలనుకుంటారు. మీరు కూడా రాస్తారు. నా మీదవచ్చే న్యూస్ చూసి వదిలేస్తాను. మేము 15 మంది క్లోజ్ ఫ్రెండ్స్. అందరం కలిసి..................

Rashmika Mandanna : నాకు రిలేషన్ గురించి ఆలోచించేంత ఖాళీ లేదు.. విజయ్,నేను క్లోజ్‌గా ఉంటాం అయితే??

Rashmika Mandanna again gives clarity about relation with vijay devarakonda

Updated On : October 11, 2022 / 12:29 PM IST

Rashmika Mandanna :  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా డేటింగ్ లో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని దీని గురించి వీళ్ళని అడిగితే మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అంటారు. కాని వీళ్ళని చూస్తుంటే అలా అనిపించదు. ఇటీవల విజయ్, రష్మిక ఇద్దరూ ముంబై ఎయిర్పోర్ట్ లో కనపడ్డారు. రష్మిక మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళింది. దీంతో వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లారనుకుంటున్నారు అందరూ. మరి నిజమెంతో వాళ్ళకే తెలియాలి.

Amitabh Bachchan: అమితాబ్‌కి కన్నీళ్లు తెప్పించిన అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

అయితే రష్మిక మాల్దీవ్స్ కి వెళ్లేముందు ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ మరోసారి విజయ్ గురించి, ప్రేమ గురించి మాట్లాడింది. రష్మిక మాట్లాడుతూ.. ”నేను హీరోయిన్ ని కాబట్టి అందరూ నా గురించి తెలుసుకోవాలనుకుంటారు. మీరు కూడా రాస్తారు. నా మీదవచ్చే న్యూస్ చూసి వదిలేస్తాను. మేము 15 మంది క్లోజ్ ఫ్రెండ్స్. అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. విజయ్, నేను కూడా క్లోజ్ గా ఉంటాము అయితే డేటింగ్ చేస్తున్నట్టు కాదు కదా. మేము అన్ని విషయాలని షేర్ చేసుకుంటాము. నాకు ప్రస్తుతం ప్రేమ, రిలేషన్ గురించి ఆలోచించే ఖాళీ లేదు. మనం ఏదైనా రిలేషన్ లో ఉంటే దానికి టైం ఇవ్వాలి, ఇప్పుడు నాకంత ఖాళీ లేదు. నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాను” అని తెలిపింది.