Rashmika Mandanna : ‘గర్ల్‌ఫ్రెండ్’ అవుతా అంటున్న రష్మిక మందన్నా.. రాహుల్ రవీంద్రన్‌తో..

ఇన్నాళ్లు గ్లామరస్ రోల్స్ చేసిన రష్మిక ఇప్పుడు గ్లామరస్ డోస్ పెంచుతూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓకే చేస్తుంది. ఇప్పటికే రెయిన్ బో సినిమా ప్రకటించగా తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని ప్రకటించింది రష్మిక.

Rashmika Mandanna : ‘గర్ల్‌ఫ్రెండ్’ అవుతా అంటున్న రష్మిక మందన్నా.. రాహుల్ రవీంద్రన్‌తో..

Rashmika Mandanna announced Lady Oriented Movie in Rahul Ravindran Direction

Updated On : October 22, 2023 / 11:37 AM IST

Rashmika Mandanna :  రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగులో, బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలో రణబీర్ సరసన యానిమల్ సినిమాతో రాబోతుంది. వచ్చే సంవత్సరం పుష్ప 2 తో రాబోతుంది. ఇవే కాక రష్మిక చేతిలో ఇంకో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు సమాచారం. అందులో శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా ఒకటి. ఇంకోటి రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది.

ఇన్నాళ్లు గ్లామరస్ రోల్స్ చేసిన రష్మిక ఇప్పుడు గ్లామరస్ డోస్ పెంచుతూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓకే చేస్తుంది. ఇప్పటికే రెయిన్ బో సినిమా ప్రకటించగా తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని ప్రకటించింది రష్మిక.

Also Read : Srinidhi Shetty : ఎట్టకేలకు బిజీ అవుతున్న KGF భామ.. ఇప్పుడైనా రెమ్యునరేషన్ మీద కాకుండా కెరీర్ మీద ఫోకస్ చేస్తుందా?

యాక్టర్, డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌(Rahul Ravindran) దర్శకత్వంలో గీత ఆర్ట్స్ నిర్మాణంలో రష్మిక మెయిన్ లీడ్ లో ‘ది గర్ల్‌ఫ్రెండ్'(The Girlfriend) అనే సినిమాని నేడు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూట్ కి వెళ్లనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి ఖుషి సినిమాతో మంచి ఆల్బమ్ ఇచ్చిన హేశం అబ్దుల్ సంగీతం ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్లు గ్లామరస్ రోల్స్ తో మెప్పించిన రష్మిక ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.