Family Star : ఫ్యామిలీ స్టార్‌లో మృణాల్ మాత్రమే కాదు.. రష్మిక, అమెరికన్ యాక్ట్రెస్ కూడా..

ఫ్యామిలీ స్టార్‌లో మృణాల్ మాత్రమే కాదట, మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా కనిపించబోతున్నారట.

Family Star : ఫ్యామిలీ స్టార్‌లో మృణాల్ మాత్రమే కాదు.. రష్మిక, అమెరికన్ యాక్ట్రెస్ కూడా..

Rashmika Mandanna aslo acted in Vijay Deverakonda Family Star

Updated On : March 23, 2024 / 8:01 AM IST

Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చితం ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ మృణాల్ మాత్రమే కాదట, మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా కనిపించబోతున్నారట.

అమెరికన్ యాక్ట్రెస్ ‘మరిస్సా రోజ్ గార్డన్’ ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ టాలీవుడ్ డెబ్యూట్ ఇస్తున్నారట. అలాగే మజిలీ మూవీ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక సాంగ్ లో గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నారట. ఆల్రెడీ ఈ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు గతంలోనే నెట్టింట లీక్ అయ్యాయి. ఇక ఈ నలుగురు భామలతో ఫ్యామిలీ స్టార్ మరింత అందంగా ఉండబోతుంది.

Also read : Allu Arjun : అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే.. చిత్రసీమ సన్మానించలేదు.. మురళీ మోహన్ కామెంట్స్

కాగా ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది దిల్ రాజు రీసెంట్ ప్రెస్ మీట్ లో తెలియజేసారు. “మనమంతా మన ఫ్యామిలీస్ కోసం కష్టపడుతూనే ఉంటాము. అలా కష్టపడే ప్రతి వ్యక్తి ఒక స్టారే కదా. అందుకనే ఈ సినిమాకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని పెట్టాము. అంతేగాని విజయ్ దేవరకొండని స్టార్‌గా చూపించడం కోసం అయితే కాదు” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఏప్రిల్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అండ్ టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి రేపు సినిమా ఎంతవరకు అలరించి ఆకట్టుకుంటుందో చూడాలి.