అమితాబ్‌‌ కూతురుగా రష్మిక.. రెండో సినిమాకే భారీగా రెమ్యునరేషన్!

అమితాబ్‌‌ కూతురుగా రష్మిక.. రెండో సినిమాకే భారీగా రెమ్యునరేషన్!

Updated On : December 31, 2020 / 3:48 PM IST

Rashmika Mandanna:కన్నడ నాట క్రేజీ హీరోయిన్‌గా మారి తెలుగునాట విమర్శకుల ప్రశంసలు అందుకునే పాత్రల్లో నటించి, సౌత్ సూపర్ స్టార్‌గా మారిన రష్మిక మందన ఇకపై బాలీవుడ్‌లో కనిపించబోతోంది. వికాస్ బహ్ల్(Vikas Bahl) తర్వాతి సినిమా డెడ్లీ చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఈ సినిమాకు రష్మిక మందనాను తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఈ సినిమాకు మొదట కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్ భావించింది. అయితే, కత్రినా నిరాకరించిన తరువాత, చిత్ర నిర్మాతలు కృతి సనన్‌ను సంప్రదించారు. కానీ కృతిసనన్ అనేక ప్రాజెక్టులలో బిజీగా ఉండడంతో.. రష్మిక మందన ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

అమితాబ్ బచ్చన్‌ కూతురుగా డెడ్లీ చిత్రంలో రష్మిక కనిపించనుండగా.. అంతకంటే ముందు రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను సినిమాలో జతకట్టబోతుంది. సాంకేతికంగా, ఇది ఆమె నటిస్తున్న రెండవ బాలీవుడ్ చిత్రం. ఈ చిత్రానికి రష్మికకు భారీగానే రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు ఉటంకిస్తున్నాయి. బాలీవుడ్‌లోకి కొత్తగా వచ్చినప్పటికీ, రష్మికకు ఐదు నుంచి ఆరు కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.

ఈ సినిమా మిషన్ మజ్నూ సినిమా తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మిషన్ మజ్ను చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బగ్చీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిషన్ మజ్ను చిత్రం ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో 1970లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)