Rashmika Mandanna : అప్పుడు వచ్చిన విమర్శలని గుర్తుపెట్టుకొని నిజం చెప్పిన రష్మిక.. రష్మిక వర్సెస్ రిషబ్ శెట్టి.. కథ సమాప్తం?

తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ తన కెరీర్ ప్రారంభం గురించి అడగగా రష్మిక మాట్లాడుతూ.. నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కొన్ని ఆడిషన్స్ కి వెళ్లినా................

Rashmika Mandanna : అప్పుడు వచ్చిన విమర్శలని గుర్తుపెట్టుకొని నిజం చెప్పిన రష్మిక.. రష్మిక వర్సెస్ రిషబ్ శెట్టి.. కథ సమాప్తం?

Rashmika mandanna clarifies about her career opening starts with rishab shetty

Updated On : March 23, 2023 / 10:31 AM IST

Rashmika Mandanna :  రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉంది. వరుస సినిమాలు చేస్తోంది రష్మిక. కానీ అప్పుడప్పుడు రష్మిక చేసే కామెంట్స్ వైరల్ గా మారి వివాదాల్లో నిలుస్తుంది. ఇటీవల కొన్ని నెలల క్రితం బాలీవుడ్(Bollywood) లో ఓ సినిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ ప్రారంభం గురించి మాట్లాడింది. అయితే తన కెరీర్ కన్నడలో కిరాక్ పార్టీ(Kirrak Party) సినిమాతో, రిషబ్ శెట్టి(Rishab Shetty), రక్షిత్ శెట్టి(Rakshit Shetty) ఛాన్స్ ఇవ్వడంతో మొదలైంది. అది ఇంటర్వ్యూలో చెప్పకుండా ఎవరో ఛాన్స్ ఇచ్చారని చెప్పింది రష్మిక. అంతే కాకుండా అప్పుడు కాంతార(Kantara) సినిమాతో ఫుల్ ఫామ్ లో రిషబ్ ఉన్నాడు. ఆ సినిమా కుడా చూడలేదని చెప్పింది.

దీంతో రిషబ్, రష్మిక మధ్య ఏదో గొడవ ఉంది అనుకున్నారు. సినిమా ఛాన్స్ ఇచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ గురించే చెప్పవా అంటూ కన్నడ ప్రేక్షకులు రష్మికాని ట్రోల్ చేశారు. రిషబ్ కూడా రష్మికని ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత రష్మిక కూడా రిషబ్ మీద కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో కన్నడ సినిమాని రష్మిక అవమాన పరిచిందని, రష్మికని బ్యాన్ చేస్తున్నారని వార్తలువచ్చాయి. ఇదంతా అవాస్తవం అని, మా మధ్య రిలేషన్ బానే ఉందని, మా మధ్య జరిగేది అందరికి చెప్పక్కర్లేదని రష్మిక సీరియస్ అయింది మీడియా ముందు. దీంతో రిషబ్ – రష్మిక మధ్య ఏం జరిగిందో, వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా ఇలా అనేక రకాల సందేహాలు మిగిలిపోయాయి.

Guna Sekhar : సమంతని ‘శాకుంతల’గా తీసుకోవడానికి ఆ సినిమాని చాలా సార్లు చూశాను

తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ తన కెరీర్ ప్రారంభం గురించి అడగగా రష్మిక మాట్లాడుతూ.. నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కొన్ని ఆడిషన్స్ కి వెళ్లినా ఓకే అవ్వలేదు. ఇక నేను యాక్ట్రెస్ అవ్వనేమో అనుకున్నాను. అలాంటి టైంలో నేనొక అందాల పోటీలో పాల్గొనగా నా ఫోటో పేపర్స్ లో చూసి రక్షిత్ శెట్టి పరంవా స్టూడియోస్‌ నుంచి కాల్ చేసి నాకు కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు అని తెలిపింది. ఆ సినిమా దర్శక నిర్మాతలు నాకు ఇచ్చిన ఛాన్స్ తోనే నాకు నటిగా కెరీర్ మొదలైందని తెలిపింది. ఒకప్పుడు ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పకుండా విమర్శల పాలైన రష్మిక ఇప్పుడు రిషబ్, రక్షిత్ ఛాన్స్ ఇచ్చారని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. దీంతో వీరి మధ్య వివాదం ముగిసింది అనుకుంటున్నారు అంతా.