Rashmika Mandanna: బాబోయ్.. రష్మిక లైనప్ చూశారా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర హీరోయిన్ లేనంత బిజీగా ఉంది. ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూ....

Rashmika Mandanna: బాబోయ్.. రష్మిక లైనప్ చూశారా..?

Rashmika Mandanna Line Up Of Movies Will Shock You

Updated On : July 13, 2022 / 5:42 PM IST

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర హీరోయిన్ లేనంత బిజీగా ఉంది. ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూ జెట్‌స్పీడుతో దూసుకుపోతుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

Rashmika Mandanna: ఐటెం పాపగా శ్రీవల్లి.. అంతా సోదేనా..?

టాలీవుడ్‌లో పుష్ప2 చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ, తమిళ స్టార్ హీరో విజయ్ సరసన వారసుడు అనే సినిమాలో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా, యానిమల్, సిద్ధార్థ్ మల్హోత్రాతో ఒక సినిమా చేస్తోంది. అంతేగాక దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సీతా రామం అనే సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా వరుసగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.

Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి

ఇక రష్మిక క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు అమ్మడు చేసే డ్యాన్స్ స్టెప్పులకు కూడా అభిమానులు ఫిదా అవుతున్నారు. పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్‌లో కూడా రష్మిక కనిపించడంతో ఆమె అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వెళ్తోంది. ఇలా అయితే అతి తక్కువ సమయంలోనే రష్మిక ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని ఫిలిం ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.