వడివేలు ఫీమేల్ వెర్షన్ రష్మిక ఫోటోలు చూశారా!

వడివేలులా రష్మిక పోజులు.. వైరల్ అవుతున్న పిక్స్..

  • Published By: sekhar ,Published On : February 27, 2020 / 08:52 AM IST
వడివేలు ఫీమేల్ వెర్షన్ రష్మిక ఫోటోలు చూశారా!

Updated On : February 27, 2020 / 8:52 AM IST

వడివేలులా రష్మిక పోజులు.. వైరల్ అవుతున్న పిక్స్..

తాజాగా ‘భీష్మ’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న కన్నడబ్యూటీ రష్మిక మందన్నా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపులర్ కమెడియన్ వడివేలులా రష్మిక పెట్టిన పోజులు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇటీవల రష్మిక ఓ ఫోటోషూట్ చేసింది. అందరు హీరోయిన్లలా పోజులిస్తే మజా ఏముంటుంది అనుకుందేమో మరి..

ముద్దుముద్దుగా చిన్నపిల్లల్లా రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఈ పిక్స్‌లో రష్మిక క్యూట్‌క్యూట్‌గా భలేఉంది అని నెటిజన్స్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అయితే రష్మిక పిక్స్ రొటీన్‌కు భిన్నంగా ఇంతకు ముందు హాస్య నటుడు వడివేలు పోజుల మాదిరి ఉండడం విశేషం. రష్మిక ఆయన పిక్స్ చూసి అలాంటి భంగిమల్లో ఫోటోలు తీసుకుందా అనిపించేలా ఉన్నాయి. ఎక్కడ దొరికాయో కానీ నెటిజన్లు రష్మిక ఫోటోల పక్కన అలాంటి భంగిమలతో ఉన్న నటుడు వడివేలు ఫోటోలను పోస్ట్‌ చేసి తెగ మీమ్స్‌ చేస్తున్నారు.

ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మీమ్స్‌ కాస్తా రష్మిక దృష్టిలో పడడంతో.. ఆమె స్పందిస్తూ.. “నేను క్యూట్‌గా ఉన్నానంటే ఒప్పుకోను. నాకంటే వడివేలు చాలా క్యూట్‌గా ఉన్నారు’’ అంటూ రిప్లై ఇచ్చింది. రష్మిక Vs వడివేలు ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి మరి. 

See  Also>>‘భీష్మ’ థ్యాంక్స్ మీట్.. ఎప్పుడు.. ఎక్కడంటే?..

Rashmika - Vadivelu