Rathika : శివాజీ, ప్రశాంత్‌లను మిస్ అవుతున్నానంటూ రతిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రతిక హౌస్‌లో ఉన్న ప్రశాంత్, శివాజీలు తన గురించి మాట్లాడుకున్న కాన్వర్సేషన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాళ్లు రతిక గురించి ఏం మాట్లాడుకున్నారంటే?

Rathika Instagram Post
Rathika : బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు రతిక ఫుల్ జోష్‌లో ఉంది. తన అందచందాలతో అలరించడమే కాదు.. టాస్క్‌లు అదరగొట్టింది. కానీ బ్యాడ్ లక్.. ఇవేమీ కలిసి రాక బయటకు వచ్చేసింది. హౌస్‌లో ఉన్న ప్రశాంత్, శివాజీలు తన గురించి మాట్లాడుకుంటున్న కాన్వర్సేషన్ అంటూ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ఈ పోస్టు చూస్తే వీరు ముగ్గురు ఎంత మిస్సవుతున్నారో? అన్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో స్నేహాలు, భావోద్వేగాల గురించి తెలిసిందే. ప్రతి సీజన్‌లో హౌస్‌లో ఉన్నప్పుడే కాదు బయటకు వచ్చి కూడా మంచి స్నేహితులు అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు. లోపల టాస్కులు ఆడే సందర్భాల్లో కోట్లాడుకున్నా కొందరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది. అలాగే ప్రశాంత్, రతిక, శివాజీల అనుబంధం కూడా అని చెప్పాలి. ప్రశాంత్, రతికల మధ్య అంతకు మించి అన్నట్లుగా కూడా మాట్లాడుకున్నారు. రతిక బయటకు వచ్చాక శివాజీ, ప్రశాంత్‌లు హౌస్‌లో ఆమెను మిస్సవుతున్నట్లు మాట్లాడుకున్న కాన్వర్సేషన్‌ను రతిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
రతిక గుర్తుకు వచ్చి ప్రశాంత్ తనకి నిద్రపట్టట్లేదని.. ఆమెపై చాలా కోపంగా ఉందని శివాజీతో చెప్తాడు. ఏం చేస్తాం రా చిన్నిపిల్ల బయటకు వెళ్లిన తర్వాత కలుద్దాం బాధపడకు.. అంటూ శివాజీ ఓదారుస్తాడు. తను నన్ను నామినేషన్ చేసినా.. మన అమ్మాయి అని మాట్లాడినా.. తను నన్ను నమ్మలేదు. బయటకు వెళ్లాక కూడా రతిక నన్ను కలవదని ప్రశాంత్ బాధపడతాడు. వీరిద్దరి కాన్సర్వేషన్ పోస్ట్ చేసిన రతిక తను కూడా వారిద్దరినీ మిస్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టింది.
ప్రశాంత్‌తో రతిక మాట్లాడుతుందో లేదో.. వీరిద్దరి బాండ్ సంగతి ఏంటో తెలియాలంటే షో కంప్లీట్ అయ్యాక తెలియాలి. మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి సీరియల్స్, సినిమాల్లో నటించినా లక్ కలిసి రాక బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చినా రతిక అక్కడ కూడా ఎక్కువరోజులు ఉండలేకపోయింది. కనీసం బిగ్ బాస్ ఇచ్చిన గుర్తింపు అయినా ఆమెకు అవకాశాలు అందిస్తుందేమో చూడాలి.

rathika