Rasha Thadani : RC16లో చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. ఆడిషన్ కూడా అయిపోయింది?

తాజాగా బాలీవుడ్(Bollywood) సీనియర్ నటి రవీనా టాండన్Raveena Tandon) కూతురు రాషా తడాని(Rasha Thadani) చరణ్ సరసన టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Rasha Thadani : RC16లో చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. ఆడిషన్ కూడా అయిపోయింది?

Raveena Tandon Daughter Rasha Thadani will play heroine Role in Ram Charan Buchibabu Sana RC16 Movie Rumors goes Viral

Updated On : October 1, 2023 / 12:33 PM IST

Rasha Thadani :  రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం శంకర్(Director Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవ్వబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ భారీగా పాన్ ఇండియా లెవల్లో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ కి రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ 16వ సినిమా RC16 ఉప్పెన హిట్ ఇచ్చిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమాని కూడా ప్రకటించారు. ఈ సినిమాపై పలు కథనాలు వస్తున్నా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయిందని, ప్రస్తుతం బుచ్చిబాబు నటీనటుల వేటలో పడ్డారని సమాచారం. పలు పాత్రలకు ఆడిషన్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చరణ్ సరసన ఓ కొత్త అమ్మాయిని తీసుకురావాలనుకుంటున్నారు.

తాజాగా బాలీవుడ్(Bollywood) సీనియర్ నటి రవీనా టాండన్Raveena Tandon) కూతురు రాషా తడాని(Rasha Thadani) చరణ్ సరసన టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాషా తడాని ఇప్పుడిప్పుడే హీరోయిన్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. బాలీవుడ్ లో ఒక సినిమా ఓకే చేసుకుంది. తాజాగా హైద్రాబాద్ కి వచ్చి బుచ్చిబాబుకి ఆడిషన్ ఇచ్చినట్టు, ఓకే అయిందని, లుక్ టెస్ట్ కూడా ఇచ్చినట్టు సమాచారం.

Also Read : Ghost Trailer : ‘ఘోస్ట్’ ట్రైలర్.. నేను వెళ్తే రణరంగం మారణహోమంగా మారుతుంది.. శివన్న యాక్షన్ ఫీస్ట్..

రాషా తడాని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనపడిన వీడియోలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో కూడా రాషా తడాని టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో RC16 సినిమాలో చరణ్ సరసన రాషా తడాని నటించొచ్చు అని భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా అయ్యాక RC16 మొదలవుతుంది.