Ravi Teja : 13 ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ ఫీట్ సాధించిన రవితేజ..
మాస్ మహారాజ రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస విజయాల్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. కాగా ఈ హీరో 13 ఏళ్ళ క్రితం సాధించిన ఫీట్ ని మళ్ళీ ఇప్పుడు అందుకున్నాడు.

raviteja
Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ ఉన్న హీరో. అయితే మిరపకాయ సినిమా ముందు వరకు ఇది కొనసాగింది. మిరపకాయతో అప్పటిలో కెరీర్ బెస్ట్ హిట్టు, కలెక్షన్స్ ని అందుకున్న రవితేజ.. ఆ తరువాత చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. దాదాపు ఆరు ప్లాప్ లను చూశాడు. రవితేజ కెరీర్ లోనే అది చాలా డౌన్ పీరియడ్. ఆ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన బలుపు సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.
Dhamaka: మాస్ రాజా ఫ్యాన్స్‌కు ధమాకా లాంటి న్యూస్.. ఇక ఓటీటీలో రచ్చరచ్చే!
ఆ వెంటనే బాబీ దర్శకత్వంలో ‘పవర్’ సినిమాతో మరో హిట్టుని అందుకున్నాడు. దీంతో మళ్ళీ హిట్టు ట్రాక్ ఎక్కాడు అనుకుంటే ‘కిక్-2’ పరాజయం ఎదురైంది. ఇలా మిరపకాయ సినిమా తరువాత నుంచి ఒక సాలిడ్ హిట్టు ఇస్తూనే.. రెండు మూడు ప్లాప్‌లు మధ్యలో ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని, ఆ వెంటనే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో పరాజయాన్ని ఎదురుకున్నాడు. తాజాగా ఈ హీరో ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ధమాకాలో డ్యూయల్ రోల్ చేసి డబుల్ ధమాకా ఇవ్వడమే కాకుండా వింటేజ్ రవితేజ మార్క్ కామెడీ అండ్ యాక్షన్ కనిపించడంతో.. సినిమా కథ పాతదే అయిన ప్రేక్షకుల బ్లాక్ బస్టర్ హిట్టు చేశారు. అంతేకాదు రవితేజ కెరీర్ లోనే మొదటి రూ.100 కోట్లు రాబట్టిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో మెయిన్ హీరో రవితేజ కాకపోయినా చిరంజీవితో సమానమైన పాత్ర అనే చెప్పాలి. అప్పుడు ఈ మూవీ హిట్టులో రవితేజకి కూడా క్రెడిట్ ఉంటుంది కదా. తాజాగా ఈ సినిమా కూడా రూ.100 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
ఇలా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ కొట్టింది 13 ఏళ్ళ క్రితం. డాన్ శీను, మిరపకాయ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్నాడు. అయితే మధ్యలో బలుపు, పవర్ సినిమాలతో కూడా బ్యాక్ టూ బ్యాక్ విజయాల్ని అందుకున్నా.. అవి జస్ట్ హిట్టుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ 13 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఆ ఫీట్ ని అందుకున్నాడు. మరి ఇప్పుడు అయినా హిట్టు ట్రాక్ ని మెయిన్‌టైన్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి.