Tiger Nageswara Rao OTT : టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌..! పండ‌గ త‌రువాతే స్ట్రీమింగ్‌..?

మాస్‌ మహారాజ రవితేజ న‌టించిన చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లు.

Tiger Nageswara Rao OTT : టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌..! పండ‌గ త‌రువాతే స్ట్రీమింగ్‌..?

Tiger Nageswara Rao OTT Partner

Updated On : October 20, 2023 / 4:38 PM IST

Tiger Nageswara Rao : మాస్‌ మహారాజ రవితేజ న‌టించిన చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లు. రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్, మురళీ శర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా నేడు (అక్టోబ‌ర్ 20)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. టైగర్‌ నాగేశ్వరరావు పాత్ర‌లో ర‌వితేజ జీవించాడ‌ని, మొత్తంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్ర డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మంచి మొత్తానికి ద‌క్కించుకున్న‌ట్లు ఆ వార్త సారాంశం. ఈ సినిమా విడుద‌లైన ఎనిమిది వారాల త‌రువాత స్ట్రీమింగ్ కు రానుంద‌ట‌. అంటే దీపావ‌ళి పండుగ త‌రువాత న‌వంబ‌ర్ చివ‌రి వారంలో లేదంటే డిసెంబ‌ర్ మొద‌టి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Dude : ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమకథ ‘డ్యూడ్’..

కథ ఏంటంటే..?
దొంగతనాలు చేసుకుంటూ బతికే జనాలు ఉన్న స్టువర్టుపురంలో పుట్టిన నాగేశ్వరరావు(రవితేజ) చిన్నప్పటినుంచే దొంగతనాలు మొదలుపెడతాడు. పెద్దయ్యాక గజదొంగగా మార‌తాడు. ఫ‌లానా ఏరియా అని కాకుండా అన్ని ఏరియాల్లోను దొంగతనాలు చేస్తుండటంతో మిగిలిన దొంగ ముఠాలు ఇతన్ని చంపాల‌ని చూస్తూ ఉంటాయి. అదే సమయంలో ప్రేమలో పడటం, తన స్టువర్టుపురం పిల్లల కష్టాలు తెలుసుకోవడంతో, తన ఊరు బాగుపడటానికి ఒక పెద్ద దొంగతనం చేయాలని వెళ్తాడు. చేసి వచ్చాక ప్రేమించిన అమ్మాయితో లేచిపోదాం అనుకున్న సమయంలో పోలీసులకు చిక్కుతాడు. ఆ తర్వాత అతని ప్రేమ ఏమైంది? జైలు నుంచి బయటకి వచ్చాడా? మళ్ళీ దొంగతనాలు చేశాడా? తన స్టువర్టుపురం ఊరు బాగుపడిందా? అనేది తెరపై చూడాల్సిందే.

Kangana Ranaut : అత్త అయిన కంగనా రనౌత్.. మేనల్లుడిని ఎత్తుకొని మురిసిపోతూ..