Raviteja: డబ్బింగ్ స్టార్ట్ చేసిన మాస్ రాజా సినిమా.. ఒకేసారి రెండు!

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా. చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటడంతో రవితేజ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Raviteja: డబ్బింగ్ స్టార్ట్ చేసిన మాస్ రాజా సినిమా.. ఒకేసారి రెండు!

Raviteja Next Movies Dubbing Works Started

Updated On : January 2, 2023 / 9:04 PM IST

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా. చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటడంతో రవితేజ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Raviteja : 2022 చాలా కష్టంగా ఉంది.. ధమాకా సక్సెస్ ని వాళ్ళకి అంకితం చేస్తున్నాను..

ఇక రవితేజ హీరోగా తన నెక్ట్స్ చిత్రాలు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కాగా తాజాగా ఈ రెండు సినిమాలు కూడా డబ్బింగ్ పనులను మొదలుపెట్టాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ సినిమాల డబ్బింగ్ పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఆయా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక రావణాసుర చిత్రాన్ని సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా, అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వర్ రావు సినిమాను వంశీ డైరెక్ట్ చేస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Raviteja: నిర్మాతగా కూడా గ్యాప్ ఇవ్వనంటోన్న మాస్ రాజా..!

రావణాసుర చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ నటిస్తుండగా సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అటు టైగర్ నాగేశ్వర్ రావులో రేణు దేశాయ్ హేమలతా లవణం పాత్రలో నటిస్తుండగా, పాన్ ఇండియా యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 7న రావణాసుర చిత్రాన్ని రిలీజ్ చేస్తుండగా, టైగర్ నాగేశ్వర్ రావు చిత్ర రిలీజ్ డేట్‌ను ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇలా ఒకేరోజున రెండు సినిమాలకు సంబంధించి డబ్బింగ్ పనులు స్టార్ట్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.