Raviteja: రవితేజ నెక్ట్స్ ప్రాజెక్టు నుండి అప్డేట్ వదిలిన చిత్ర యూనిట్!

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లతో మాస్ రాజాకు అదిరిపోయే సక్సెస్‌ను అందించింది. ఇక ఈ సినిమాలో రవితేజ మాస్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన తీరు ప్రేక్షకును ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Raviteja: రవితేజ నెక్ట్స్ ప్రాజెక్టు నుండి అప్డేట్ వదిలిన చిత్ర యూనిట్!

Raviteja Next Project Tiger Nageswara Rao New Update

Updated On : January 12, 2023 / 7:46 PM IST

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లతో మాస్ రాజాకు అదిరిపోయే సక్సెస్‌ను అందించింది. ఇక ఈ సినిమాలో రవితేజ మాస్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన తీరు ప్రేక్షకును ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Raviteja: డబ్బింగ్ స్టార్ట్ చేసిన మాస్ రాజా సినిమా.. ఒకేసారి రెండు!

కాగా, ఈ సినిమా తరువాత రవితేజ తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా మారాడు. ఇప్పటికే రావణాసుర చిత్ర డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడు రవితేజ. ఇక మరో సినిమా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్‌ను వదిలింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోన్న చిత్ర యూనిట్, ప్రస్తుతం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లుగా తెలిపింది.

ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. దర్శకుడు వంశీ ఈ సినిమాను ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లు నటిస్తోన్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.