Ravanasura : రావణాసుర గ్లింప్స్ రిలీజ్.. హీరోలు ఉండరు.. రవితేజ విలనా??

తాజాగా రవితేజ పుట్టిన రోజు, రిపబ్లిక్ డే సందర్భంగా రావణాసుర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిషేక్ పిక్చర్స్, RT టీంవర్క్స్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. ఈ సినిమాలో...............

Ravanasura : రావణాసుర గ్లింప్స్ రిలీజ్.. హీరోలు ఉండరు.. రవితేజ విలనా??

Raviteja Ravanasura movie glimpse released

Ravanasura :  మాస్ మహారాజ రవితేజ పుట్టిన రోజు నేడు. గత కొన్నేళ్లు ఫ్లాప్స్ తో సతమతమయి క్రాక్ సినిమాతో భారీ హిట్ కొట్టిన రవితేజ వెంటనే రెండు ఫ్లాప్స్ చూశాడు. కానీ ఈ సారి మాత్రం వరుస హిట్స్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వెంటవెంటనే భారీ హిట్స్ కొట్టి వంద కోట్ల సినిమాలు సాధించారు రవితేజ. నెక్స్ట్ రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ హిట్ కి రెడీ అయ్యాడు.

అభిషేక్ పిక్చర్స్, RT టీంవర్క్స్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. ఈ సినిమాలో సుశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫారియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 7న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Vani Jairam : అయిదు దశాబ్దాల సంగీత ప్రయాణం.. ‘శంకరాభరణం’ వాణీ జయరాంకు పద్మభూషణ్..

తాజాగా రవితేజ పుట్టిన రోజు, రిపబ్లిక్ డే సందర్భంగా రావణాసుర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మర్డర్స్ చేసినట్టు, అమ్మాయిలని బలవంత పెట్టినట్టు కొన్ని షాట్స్ చూపించారు. ఆ తర్వాత రవితేజ లో నెగిటివ్ షేడ్స్ కనపడేలా రవితేజని చూపించారు. Heroes Dont exist అంటూ టైటిల్ వేసి రవితేజని చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో పాటు లాయర్ గా మరో క్యారెక్టర్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఇక హర్షవర్ధన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ గ్యారెంటీగా హ్యాట్రిక్ హిట్ కొడతాడు అని అంటున్నారు.