Tiger Nageswara Rao : జింకలని వేటాడే పులిని చూసుంటావు.. పులులను వేటాడే పులిని చూశావా.. ఫస్ట్ లుక్ గ్లింప్స్!
రవితేజ మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. స్టూవర్టుపురం గజదొంగని.. జాన్ అబ్రహం, దుల్కర్ సల్మాన్, కార్తీ, శివ రాజ్ కుమార్, వెంకటేష్ పాన్ ఇండియాకి పరిచయం చేశారు.

Raviteja Tiger Nageswara Rao First Look Teaser released
Tiger Nageswara Rao First Look Teaser : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఒక్కప్పుడు స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కొత్త దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాశ్మీర్ ఫైల్స్, కార్త్తికేయ 2 వంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమా నిర్మిస్తుండడంతో నార్త్ సైడ్ కూడా టైగర్ నాగేశ్వరరావు పై ఆసక్తి చూపిస్తున్నారు.
Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ లాంచ్.. రాజమండ్రి బ్రిడ్జ్ మీద రచ్చ రచ్చ..
ఇక ఈ మూవీ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ ని చాలా గ్రాండ్ గా రివీల్ చేస్తున్నారు. రాజమండ్రి బ్రిడ్జి మీద ఈ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ అక్కడ జరగలేదు. ఇది ఇలా ఉంటే.. ఈ స్టూవర్టుపురం గజదొంగని పాన్ ఇండియా వైడ్ పరిచయం చేయడానికి 5 బాషల నుంచి 5 హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో జాన్ అబ్రహం, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో కార్తీ, కన్నడలో శివ రాజ్ కుమార్, తెలుగులో వెంకటేష్.. టైగర్ నాగేశ్వరరావు గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి గజదొంగగా రవితేజని పరిచయం చేశారు. ఇక గ్లింప్స్ లో ‘జింకలని వేటాడే పులిని చూసుంటావు పులులను వేటాడే పులిని చూశావా’ అన్న డైలాగ్ గూస్బంప్స్ తెప్పించింది.
స్టూవర్టుపురం గజదొంగగా రవితేజ తనలోని వైల్డ్నెస్ మొత్తాన్ని చూపించేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ సినిమాని అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.