రెడీ పాటలో తమన్నా రచ్చ మామూలుగా లేదుగా!

తెలుగులో 'అభినేత్రి-2', తమిళ్‌లో 'దేవి-2' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలోని 'రెడీ రెడీ' అనే తమిళ్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : May 7, 2019 / 01:14 PM IST
రెడీ పాటలో తమన్నా రచ్చ మామూలుగా లేదుగా!

Updated On : May 7, 2019 / 1:14 PM IST

తెలుగులో ‘అభినేత్రి-2’, తమిళ్‌లో ‘దేవి-2’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలోని ‘రెడీ రెడీ’ అనే తమిళ్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా, మిల్కీబ్యూటీ జంటగా, ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్.. అభినేత్రి.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ‘అభినేత్రి-2’, తమిళ్‌లో ‘దేవి-2’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలోని ‘రెడీ రెడీ’ అనే తమిళ్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ఈ పాటలో తమన్నా రచ్చ మామూలుగా లేదు. అందాల ఆరబోతకి హద్దే లేదన్నట్టు రెచ్చిపోయింది.

శామ్ సిఎస్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి ప్రభుదేవా లిరిక్స్ రాయగా, నిన్సీ విన్సెంట్ పాడింది. కోవై సరళ, సోనూసూద్, అజ్మల్, సప్తగిరి ఇంపార్టెంట్ రోల్స్ చేసిన అభినేత్రి-2, మే 31న తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.ఈ సినిమాకి కెమెరా : అయాంక బోస్, ఎడిటింగ్ : ఆంటొనీ,  కొరియోగ్రఫీ : పరేష్ శిరోద్కర్, ఫైట్స్ : స్టంట్ సెల్వ.

వాచ్ సాంగ్..