Chiranjeevi Mother : చిరంజీవి తల్లితో ప్రభాస్ పెద్దమ్మ.. ఫొటోస్ వైరల్..

Rebel Star Prabhas Peddamma with Chiranjeevi mother Anjanamma
Chiranjeevi Mother : నిన్న రాత్రి ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ కి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు వచ్చారు. అక్కినేని, మెగా కుటుంబాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అక్కినేని కుటుంబం సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ అవార్డును అందించారు. ఈ సందర్బంగా చిరంజీవి చాలా విషయాలను పంచుకున్నారు.
Also Read : Sai Pallavi : బాయ్‌కాట్ సాయి పల్లవి అంటూ సోషల్ మీడియాలో దుమారం.. నేచురల్ బ్యూటీ స్పందన ఏంటి..
అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనమ్మ గారు ముందు వరుసలో కూర్చున్నారు. ఇక అదే సమయంలో అంజనమ్మ దగ్గరికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి వచ్చి కూర్చున్నారు. చాలా సేపు అంజనమ్మ దగ్గరే కూర్చొని ఆమెతో మాట్లాడారు. అలా వీరిద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలాగే నాగర్జున మేనకోడలు సుప్రియ సైతం అంజనమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అక్కడే కూర్చొని పలు ఫోటోలు దిగారు. దీంతో ప్రస్తుతం అంజనమ్మతో శ్యామలా దేవి, నాగార్జున మేనకోడలు సుప్రియ దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.