పెదనాన్న బర్త్‌డే పార్టీలో ప్రభాస్ – ఘనంగా కృష్ణంరాజు 80వ జన్మదిన వేడుకలు..
ప్రభాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు 80వ జన్మదిన వేడుకలు..

ప్రభాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు 80వ జన్మదిన వేడుకలు..
రెబల్ స్టార్ కృష్ణంరాజు జనవరి 20న తన 80వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. డార్లింగ్ ప్రభాస్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు గెస్ట్‌లందరినీ రిసీవ్ చేసుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, శివ కృష్ణ, బి.గోపాల్, సంగీత దర్శకులు కోటి తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు దంపతులు కృష్ణంరాజు దంపతులను పూలమాలతో సత్కరించారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య కృష్ణంరాజు కేక్ కట్ చేశారు.
Read Also : భళారే బాలయ్య – మాస్ NBK 106 లోడింగ్!
కృష్ణంరాజు ప్రస్తుతం ప్రభాస్ 20వ సినిమాలో నటిస్తున్నారు. ‘బిల్లా’, ‘రెబల్’ తర్వాత కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. యూవీ క్రియేషన్స్‌తో కలిసి గోపికృష్ణ మూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.