Release Date Locked For NBK108: బాలయ్య కూడా దూకుడు చూపిస్తున్నాడుగా.. అప్పుడే 108కి డేట్ ఫిక్స్..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టును ఇటీవల అనౌన్స్ చేశాడు. బాలయ్య 108వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అప్పుడే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

Release Date Locked For NBK108: బాలయ్య కూడా దూకుడు చూపిస్తున్నాడుగా.. అప్పుడే 108కి డేట్ ఫిక్స్..?

Release Date Locked For NBK108 Before Starting Shoot

Updated On : August 19, 2022 / 11:24 AM IST

Release Date Locked For NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టును ఇటీవల అనౌన్స్ చేశాడు.

NBK108 Movie: బాలయ్య నెక్ట్స్ మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!

టాలీవుడ్‌లో ఇప్పటికే ఫెయిల్యూర్‌లేని దర్శకుడిగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల ఎఫ్3 మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్, త్వరోలనే బాలయ్య 108 చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, ఈ మూవీకి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

NBK108: అఫీషియల్.. బాలయ్యతో సినిమా కన్ఫం చేసిన అనిల్ రావిపూడి!

బాలయ్య 108వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అప్పుడే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్యను ఇదివరకు ఎప్పుడూ చూడని గెటప్‌లో అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ఆయన కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తుండటంతో ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ నెలలో సమ్మర్ ట్రీట్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. అయితే అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 28వ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఏప్రిల్‌లో బాలయ్య వర్సెస్ మహేష్ పోటీని మనం బాక్సాఫీస్ వద్ద చూడబోతున్నామని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.