Allu Ramalingaiah : అల్లు రామలింగయ్యకు చిరు – బన్నీ నివాళులు..

అల్లు రామలింగయ్య వర్థంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ నివాళులర్పించారు..

Allu Ramalingaiah : అల్లు రామలింగయ్యకు చిరు – బన్నీ నివాళులు..

Allu Ramalingaiah

Updated On : July 31, 2021 / 4:54 PM IST

Allu Ramalingaiah: హాస్య నటుడు, విలక్షణ నటుడు, తెలుగు సినీ వినీలాకాశంలో తన హాస్యంతో నవ్వులు పూయించిన నవ్వులరేడు.. హాస్యపు జల్లు.. అల్లు.. నేడు(జూలై 31) పద్మశ్రీ, డా. అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అల్లు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా అల్లు రామలింగయ్యకు నివాళులర్పించారు.

‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి. ఒక డాక్టర్‌గా,యాక్టర్‌గా, ఫిలాసఫర్‌గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ’.. అంటూ చిరు నివాళులర్పించారు.

‘రైతు, దిగ్గజ నటుడు, ఒక గొప్ప వ్యక్తి అయిన తాత అల్లు రామలింగయ్య గారి వర్ధంతి ఈరోజు.. సినిమాలపై అయనకున్న అభిరుచి, ఆయన జీవిత ప్రయాణం మనలో చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఆయన మన హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు’.. అని అల్లు అర్జున్ ట్వీట్ ద్వారా తాతకు నివాళులర్పించారు.