Renu Desai : వరుణ్ పెళ్ళికి వెళ్లట్లేదు.. చిన్నప్పట్నుంచి నా కళ్ళ ముందే పెరిగాడు కానీ.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి(Italy) చేరుకొని పెళ్లి పనుల్లో సందడిగా ఉన్నారు.

Renu Desai : వరుణ్ పెళ్ళికి వెళ్లట్లేదు.. చిన్నప్పట్నుంచి నా కళ్ళ ముందే పెరిగాడు కానీ.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Renu Desai Interesting Comments on Varun Tej Marriage

Updated On : October 30, 2023 / 11:37 AM IST

Renu Desai : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి(Italy) చేరుకొని పెళ్లి పనుల్లో సందడిగా ఉన్నారు. పవర్ స్టార్ కూడా తన భార్య అన్నా లెజనోవాతో కలిసి వరుణ్ పెళ్ళికి ఇటీవలే ఇటలీ వెళ్లారు. అయితే ఈ పెళ్ళికి పవన్, రేణు దేశాయ్ పిల్లలు అకిరా, ఆద్య వెళ్లట్లేదని తెలుస్తుంది. గతంలో నిహారిక పెళ్ళికి ఆద్య, అకిరా కూడా వచ్చి సందడి చేశారు.

Also Read : వరుణ్ లావణ్య పెళ్లి వేడుకల షెడ్యూల్ ఇదే.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే?

తాజాగా రేణు దేశాయ్ వరుణ్ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ పెళ్ళికి నేను వెళ్లట్లేదు. వరుణ్ కి 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. చిన్నప్పట్నుంచి నా కళ్ళ ముందే పెరిగాడు. నేను పెళ్ళికి వెళ్లకపోయినా నా విషెష్ మాత్రం ఎప్పుడూ వరుణ్ కి ఉంటాయి. తన మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. పిలిచినా ఒకవేళ నేను వెళ్లినా అక్కడ ఫ్యామిలీ అంతా అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. నిహారిక పెళ్ళికి కూడా అందుకే వెళ్ళలేదు. పిల్లల్ని పంపించాను అని తెలిపింది. అయితే ఈ సారి వరుణ్ పెళ్లి ఇటలీలో జరుగుతుండటంతో పిల్లల్ని కూడా పంపించట్లేదు రేణుదేశాయ్.