చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రిపబ్లిక్ డే వేడుకలు

71 వగణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా రక్తదాన శిబిరాన్నినిర్వహించారు. ఈవేడుకలకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యి జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసైనికులు, స్వఛ్చందంగా రక్తదానం చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
ఎక్కువ సార్లు రక్తదానం చేసిన JSP సోషల్ రెస్పాన్సిబులిటీ సంస్ధ సభ్యులనుఆబినందించారు. ఈ రక్తదాన శిబిరంలో 325 మంది రక్తదానం చేయగా…..ఇప్పటి వరకు ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి అల్లు అరవింద్ అవార్డులు అందచేశారు.