ఇక నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం కంగనా అవుతుందేమో.. RGV ట్వీట్

  • Published By: sreehari ,Published On : September 9, 2020 / 06:22 PM IST
ఇక నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం కంగనా అవుతుందేమో.. RGV ట్వీట్

Updated On : September 9, 2020 / 6:39 PM IST

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే.. ఆయన తీసే సినిమాలతోనే కాదు… తనదైన శైలిలో ట్వీట్లతోనూ సోషల్ మీడియాలో ఫుల్ హీటెక్కిస్తుంటాడు.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సంగతి తెలిసిందే..



సుశాంత్ కేసులో మీడియా అటెన్షన్, సీబీఐ దర్యాప్తులపై ఆర్జీవీ స్పందించాడు.. అంతేకాదు.. బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన నటి కంగనా రనౌత్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా RGV స్పందించాడు.


ఇక తర్వాతి మహారాష్ట్ర సీఎం కచ్చితంగా కంగనా రనౌత్‌ అవుతుందనిపిస్తుందని RGV ట్వీట్ చేశారు.. అదే జరిగితే బాలీవుడ్‌ వాళ్లందరూ timbaktu ప్రాంతానికి మకాం మార్చాలని RGV ట్వీట్ పెట్టారు. ఇంతకీ timbaktu అంటే.. నైజీర్‌ నదికి సమీపంలోని మలి దేశంలోని నగరంగా చెబుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశంలో కరోనాకు వ్యాక్సిన్‌ లేదు. అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్‌ లేదంటూ RGV వ్యంగ్యంగా మరో ట్వీట్ చేశారు.



రామ్‌ గోపాపాల్‌ వర్మ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. దొర‌సాయి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ బ‌యోపిక్‌ను మూడు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. ఒక్కో భాగం రెండు గంట‌ల నిడివి ఉంటుంది. ముందు రెండు భాగాల్లో కొందరు న‌టులు న‌టించ‌నున్నారు.. మూవీ చివ‌రి భాగంలో RGV న‌టించ‌నున్నారని సమాచారం.