Apsara Rani : ఆర్జీవీ భామ అప్సర.. పుట్టిన రోజు స్పెషల్.. ‘రాచరికం’ అరాచకం చూశారా?

నేడు అప్సర రాణి పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచే ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Apsara Rani : ఆర్జీవీ భామ అప్సర.. పుట్టిన రోజు స్పెషల్.. ‘రాచరికం’ అరాచకం చూశారా?

RGV Girl Apsara Rani Racharikam Movie First Look Released on her Birthday

Updated On : January 12, 2024 / 4:51 PM IST

Apsara Rani : ఆర్జీవీ భామగా అప్సర రాణి బాగా పాపులర్ అయింది. ఆర్జీవితో రెండు సినిమాలు చేసి, తన అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్స్ తో బాగా పాపులర్ అయింది. ఆర్జీవీ తెచ్చిపెట్టిన పాపులారిటీతో ఐటెం సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది అప్సర. ఇటీవల అప్సర రాణి హీరోయిన్ గా, కొత్త హీరో విజయ్ శంకర్ హీరోగా ‘రాచరికం’ అనే సినిమాని ప్రకటించారు.

చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మాణంలో సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో ఈ రాచరికం సినిమా తెరకెక్కుతుంది. పవర్ ఫుల్ టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి పెంచగా ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసుకొని షూటింగ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. నేడు అప్సర రాణి పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచే ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Also Read : Purnaa : ‘కుర్చీ మడతపెట్టి..’ సాంగ్‌లో ఆ హీరోయిన్ స్పెషల్ అప్పీరెన్స్.. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత స్పెషల్ సాంగ్‌తో..

అప్సర రాణి పోస్టర్ భయంకరంగా ఉండి ఆసక్తి కలిగిస్తుంది. ఈ పోస్టర్ లో అప్సర నోట్లో కొడవలి పట్టుకొని, ఎవర్ని నరికినట్టు సీరియస్ గా చూస్తుంది. వెనకాల అమ్మవారి ప్రతిమ ఉన్నట్టు ఉంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారగా రాచరికం ఎంత అరాచకంగా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రాచీ థాకర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.