Naa Love Story : వాలెంటైన్స్ డే రోజు ‘నా లవ్ స్టోరీ’.. లవ్ స్టోరీతో వస్తున్న ఆర్జీవీ శిష్యుడు..
ఆర్జీవీ శిష్యుడు ఓ లవ్ స్టోరీ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు.

RGV Student Vinay Gonu Introducing as Director with Naa Love Story Movie First Look Poster Released on Valentines Day
Naa Love Story : మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్స్ పై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో మోహిత్ పెద్దాడ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Aha Dance Ikon 2 : నేటి నుంచే ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ షో.. ఇలాంటి షో ఇప్పటిదాకా చూడలేదు..
నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను RX 100, మంగళవారం ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఈ సినిమా డైరెక్టర్ వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేశాం. ఈ వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్ నేను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కొత్త తరహా ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. డైరెక్టర్ వినయ్ గోను ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలి అని అన్నారు.
డైరెక్టర్ వినయ్ గోను మాట్లాడుతూ.. మా సినిమా పోస్టర్ లాంచ్ చేసిన నా ఫ్రెండ్ అజయ్ భూపతికి ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఏం మాయ చేసావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో అలాంటి అవకాశం వచ్చింది. ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతం ఇస్తాను. మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయి అని అన్నారు. ఇక ఈ నా లవ్ స్టోరీ సినిమా షూటింగ్ మార్చి నెల మొదటి వారం నుంచి ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
#NaLoveStory seems like a fresh & relatable love story ❤️
All the best director #VinayGonu 🤝 & entire team. Wish you grand success👍🏻#DommarajuAmaravathi #SreekanthReddy @MC_maheera @SupriyaArts @charanarjunwave @Gkcinemapro pic.twitter.com/zRbhzuBtml
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 14, 2025