సంవత్సరం తర్వాత అదే రోజున ‘దిశా ఎన్‌కౌంటర్’ విడుదల..
Disha Encounter First Look: కొద్దికాలంగా వాస్తవిక సంఘటనల ఆధారంగా వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తోన్న కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా సంఘటనను బేస్ చేసుకుని రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దిశా ఎన్‌కౌంటర్’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.
కొందరు వ్యక్తులు ఓ అమ్మాయిని పాశవికంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని కాల్చేశారు. ఆ అమ్మాయిని చంపిన వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దేశంలోనే భయానకమైన ఘటనగా దీన్ని పేర్కొన్న వర్మ, దిశా హత్య జరిగి ఏడాది అవుతుంది. నవంబర్ 26, 2019లో దిశా ఘటన జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే నవంబర్ 26, 2020న తన ‘దిశా ఎన్‌కౌంటర్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

