Bollywood Drugs Case: రియా రిమాండ్ పొడిగింపు..

  • Published By: sekhar ,Published On : October 6, 2020 / 07:55 PM IST
Bollywood Drugs Case: రియా రిమాండ్ పొడిగింపు..

Updated On : October 6, 2020 / 8:17 PM IST

Rhea judicial custody extended: బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా హీరోయిన్ రియా చక్రవర్తి రిమాండ్‌ను ముంబై సెషన్స్ కోర్టు పొడిగించింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రంగంలోకి దిగి రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు మరో నలుగురుని అరెస్ట్ చేసి ముంబై సెషన్స్‌ కోర్టు ముందు హాజరుపరిచగా విచారణ నిమిత్తం కోర్టు వీరిని అక్టోబర్‌ 6 వరకు జ్యూడిషియల్‌ కస్టడీకి పంపిన సంగతి తెలిసిందే.


కాగా వీరి కస్టడిని ముంబై సెషన్స్‌ కోర్టు అక్టోబర్‌ 20 వరకు పొడిగించింది. ఈ మేరకు ఈ రోజు (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈ కేసులో బెయిల్‌ కోరుతూ రియా ముంబై కోర్టులో గత నెలలో పిటీషన్‌ దాఖలు చేసింది.


అయితే ఈ పిటీషన్‌ను కోర్టు రిజర్వులో ఉంచింది. దీనిపై తదుపరి ఉత్తర్వును బుధవారం వెల్లడించే అవకాశం ఉన్నట్టు బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ కేసులో హీరోయిన్స్ దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.