సుశాంత్ సింగ్ కేసు గుట్టుమట్టంతా ఈ హైదరాబాదీకి తెలుసని ఎందుకు సిబిఐ భావిస్తోంది?

సుశాంత్ సూసైడ్ తో.. చాలా మంది హైలెట్ అయిపోయారు. వారిపై పోలీసుల ఫోకస్సే కాదు.. పబ్లిక్ ఫోకస్ కూడా పెరిగిపోయింది. అలా.. ఈ కేసులో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిన మరో వ్యక్తి.. సిద్ధార్థ్ పితానీ. ఈ హైదరాబాదీతో పాటు సుశాంత్ మేనేజర్లు శామ్యూల్ మిరాండా, శృతి మోడీ కూడా ఈ కేసులో కీలకంగా మారారు.
సుశాంత్ కేసులో అందరి ఫోకస్ రియా చక్రవర్తి, ఆమె బ్రదర్ షోవిక్ చక్రవర్తి మీదకు వెళ్లింది. వారితో పాటు అందరి అటెన్షన్.. మరో వ్యక్తి పైకి కూడా వెళ్లింది. అతనే.. సిద్దార్థ్ పితానీ. సుశాంత్ మరణించినప్పటి నుంచి.. సిద్దార్థ్ పేరు కూడా మీడియాలో బాగానే వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతను సుశాంత్ సింగ్‌కు రూమ్‌మేట్ కావడమే. సుశాంత్ చనిపోయిన రోజు కూడా అతని ఫ్లాట్‌లో ఉన్నది సిద్దార్థే.
సుశాంత్ చనిపోయిన రోజు.. డోర్స్ ఓపెన్ కావడం లేదంటూ.. సుశాంత్ అక్కకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు సిద్దార్థ్. రూమ్ తలుపులు తెరిపించింది కూడా పితానీనే.
సిద్దార్థ్ పితానీ.. హైదరాబాదీ. సినిమా మేకింగ్‌పై ప్యాషన్‌తో జైపూర్‌లో పనిచేస్తున్న సిద్దార్థ్.. 2019లో సుశాంత్‌కు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అతనితో పాటే రూమ్‌లో ఉన్నాడు. అతనికి స్నేహితుడిగా మాత్రమే కాదు.. సుశాంత్ క్రియేటివ్ మేనేజర్‌గా కూడా సిద్దార్థ్ వ్యవహరించాడు. సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు బాగా తెలుసంటున్నాడు సిద్దార్థ్.
రియా, సుశాంత్ మధ్య ఏం జరిగింది.. వాళ్లిద్దరూ ఎప్పటి నుంచి కలిసున్నారు.. సుశాంత్ మరణానికి ముందు ఫ్లాట్‌కి ఎవరెవరు వచ్చి వెళ్లారన్న దానిపై సిద్దార్థ్‌కి క్లారిటీ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పితానీ మాత్రం.. అసలేం జరిగిందో తనకు తెలియదంటున్నాడు. మరోవైపు.. తనను రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సుశాంత్ కుటుంబసభ్యులు ఒత్తిడి తెస్తున్నారంటూ.. ముంబై పోలీసులకు కొన్ని రోజుల క్రితం మెయిల్ చేశాడు సిద్దార్థ్ పితానీ.
సుశాంత్ కేసులో.. సిద్దార్థ్ నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది సీబీఐ. సుశాంత్ చనిపోయే కొన్ని గంటల ముందు ఏం జరిగింది? అతనితో ఎవరెవరున్నారనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే.. సుశాంత్ ఫ్లాట్‌లో కీలక ఆధారాలను సేకరించింది సీబీఐ. జూన్ 14న రికార్డైన సీసీ ఫుటేజ్‌ని కూడా స్వాధీనం చేసుకుంది.
ఐతే.. జూన్ 14 రాత్రి.. సుశాంత్ తనతో నార్మల్‌గానే మాట్లాడాడని సిద్దార్థ్ సీబీఐకి చెప్పినట్లు సమాచారం. రియా.. సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందన్న దానిపైనా సీబీఐ సిద్దార్థ్‌ను ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారిన సుశాంత్ డెత్ కేసులో.. సిద్దార్థ్ పితానీ స్టేట్‌మెంట్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.
సుశాంత్ కేసులో.. అతని మాజీ మేనేజర్ శృతి మోడీ కూడా కీలకంగా మారింది. కొన్నాళ్ల క్రితం.. శృతి సుశాంత్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసేది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి.. శృతి మోడీని ఈడీ అనేకసార్లు ప్రశ్నించింది. రియా చక్రవర్తి కాల్ డేటా ప్రకారం.. ఆవిడ శృతితో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది.
రియా.. శృతి మోడీతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేదని.. 808 సార్లు వాళ్ల మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు తేల్చారు. విచారణలో భాగంగా.. సుశాంత్‌కు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు రియానే చూసుకునేదని శృతి మోదీ చెప్పింది.
ఇక.. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు శామ్యూల్ మిరాండా. ఇతను.. సుశాంత్ హౌస్ మేనేజర్‌గా పనిచేశాడు. ఇప్పటికే సీబీఐ కూడా ఇతన్ని ప్రశ్నించింది. రియా చక్రవర్తికి.. శామ్యూల్ బాగా తెలుసు. వీళ్లిద్దరి మధ్య 259 ఫోన్ కాల్స్ గుర్తించారు అధికారులు. మనీలాండరింగ్ కేసులో.. ఈడీ కూడా శామ్యూల్‌ని ప్రశ్నించింది. మిరాండా.. సుశాంత్ దగ్గర.. గతేడాది ఏప్రిల్‌లో చేరాడు.
లాక్‌డౌన్ తర్వాత.. సుశాంత్ ఇంటికి శామ్యూల్ వెళ్లలేదు. ఆ తర్వాత.. అతని దగ్గర పని మానేశాడు. సుశాంత్ మృతి తర్వాత.. ఈ కేసులో శామ్యూల్ మిరాండా కూడా కీలకంగా మారాడు. అందుకే.. సీబీఐ అతన్ని కూడా ప్రశ్నిస్తోంది. కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది.