తియ్ బండి.. సుశాంత్ ట్రాక్‌లోకి వచ్చేలా ఉన్నాడే..

సుశాంత్ అనుమోలు.. నటసామ్రాట్, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, కింగ్ నాగార్జున మేనల్లుడిగా ‘కాళిదాసు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ‘కరెంట్’, ‘అడ్డా’ ‘ఆటాడుకుందాం రా’ వంటి సినిమాలు చేశాడు.
హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమైన ‘చి.ల.సౌ’ చిత్రం సుశాంత్‌కు నటుడిగా తనకు మంచి పేరు తెచ్చింది. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.. (నో పార్కింగ్) అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.
Read Also : ‘ఉప్‌చిక్.. ఉప్‌చిక్.. ఉప్పా ఉప్పా’.. అందుకే ఆ టాటూ వేసుకున్నా..
మార్చి 18 సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘రైడ్ విత్ సుశాంత్’ పేరుతో టీజర్ లాంటి వీడియా ఒకటి రిలీజ్ చేశారు. సుశాంత్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. దర్శన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా సుశాంత్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.