Rishab Shetty : పుట్టిన రోజు నాడు మంచిపని మొదలుపెట్టిన స్టార్ హీరో.. పేద విద్యార్థుల కోసం ‘రిషబ్ శెట్టి’ ఫౌండేషన్

ప్రస్తుతం రిషబ్ కాంతార సినిమాకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. తాజాగా రిషబ్ శెట్టి పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్, తన భార్య కలిసి ఓ మంచిపనిని మొదలుపెట్టారు.

Rishab Shetty : పుట్టిన రోజు నాడు మంచిపని మొదలుపెట్టిన స్టార్ హీరో.. పేద విద్యార్థుల కోసం ‘రిషబ్ శెట్టి’ ఫౌండేషన్

Rishab Shetty and his wife started a Foundation for poor Students

Updated On : July 10, 2023 / 7:28 AM IST

Rishab Shetty Foundation :  కన్నడ హీరో రిషబ్ శెట్టి ఇటీవల కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కాంతార. చిన్న సినిమాగా రిలీజయి కన్నడలో విజయం సాధించిన అనంతరం దేశమంతటా విడుదల అయి భారీ విజయం సాధించింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా రిషబ్ శెట్టి స్టార్ హీరో అయిపోయాడు, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

ప్రస్తుతం రిషబ్ కాంతార సినిమాకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. తాజాగా రిషబ్ శెట్టి పుట్టిన రోజు జరుపుకున్నారు. అయితే ఈ సారి అతని అభిమానులు గ్రాండ్ గా అభిమానుల మధ్య ఈ వేడుకలు చేశారు. ఈ వేడుకలకు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టితో కలిసి వచ్చారు. ఈ ఈవెంట్ లో కేక్ కట్ చేసి రిషబ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు అభిమానులు.

Siva Karthikeyan : కేవలం 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని సినిమాకు ఓకే చెప్పిన స్టార్ హీరో..

ఈ నేపథ్యంలో రిషబ్, తన భార్య కలిసి ఓ మంచిపనిని మొదలుపెట్టారు. ఈ వేడుకల్లో రిషబ్ భార్య ప్రగతి శెట్టి మాట్లాడుతూ.. గతంలో చాలా మంది పేద విద్యార్థులకు రిషబ్ సహాయం చేశారు. అది ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిషబ్ శెట్టి ఫౌండేషన్ ని ప్రారంభిస్తున్నాం. పేద విద్యార్థుల కోసం, వారి చదువుల కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుందని ప్రకటించారు. దీంతో అభిమానులతో పాటు, పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఈ జంటని అభినందిస్తున్నారు. ఇక ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రగతి శెట్టి చూసుకోనున్నట్టు సమాచారం.