Guppedantha Manasu : జగతి మరణానికి కారణం ఎవరో రిషికి తెలిసిపోతుందా? తల్లి ఫోటో ముందు రిషి ఇచ్చిన మాట ఏంటి?
దేవయాని, శైలేంద్ర మహేంద్ర కుటుంబంపై కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తన తల్లి మరణానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనంటాడు రిషి. జగతి మరణానికి కారకులెవరో రిషికి తెలిసిపోతుందా?

Guppedantha Manasu
Guppedantha Manasu : దేవయాని, శైలేంద్ర మహేంద్ర కుటుంబంపై కుట్రలు పన్నుతూనే ఉంటారు. కొడుకు శైలేంద్రతో తమ కుట్రలు బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది దేవయాని. వారి మాటలు విన్న వసుధర నిలదీస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో ఏం జరిగిందంటే?
దేవయాని, శైలేంద్ర తమ కుట్రలు బయటపడకుండా జాగ్రత్తలో ఉండాలని మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి చావుకి కారణం ఎవరో తెలిసిన మహేంద్రతో పాటు వసుధరతో కూడా జాగ్రత్తగా ఉండాలని దేవయాని అంటుంది. ముందు వసుధర సంగతి చూడాలని శైలేంద్ర అంటుండగా వారి మాటలు విన్న వసుధర అక్కడికి వచ్చి ఇద్దర్నీ నిలదీస్తుంది. మీ ఇద్దరి గుట్టు రట్టు అయ్యే రోజు తొందరలోనే ఉందని హెచ్చరిస్తుంది. జగతి మేడం మరణం వెనుక ఏదో కుట్ర జరిగిందని రిషి ఎంక్వైరీ చేస్తున్నాడని అన్ని విషయాలు బయటపడతాయని అంటుంది. ఈలోపు అక్కడికి రిషి రావడంతో దేవయాని, శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతారు.
Guppedantha Manasu : జగతి మేడం చనిపోయింది.. గుప్పెడంత మనసు సీరియల్‌లో భారీ ట్విస్ట్
రిషి జగతి మరణాన్ని తట్టుకోలేక కుమిలిపోతాడు. తల్లి బ్రతికినన్ని రోజులు సరిగా చూసుకోలేకపోయానని ఆమె చివరి కోరిక మాత్రమే తీర్చానని ఆవేదన చెందుతాడు. దేవయాని రిషిని ఓదార్చినట్లు నటిస్తుంది. తన ప్రాణాలు తీసే అవసరం ఎవరికి వచ్చిందో దేవయానికి చెప్పమంటాడు రిషి. నా శత్రువులు ఎవరో తెలుసుకుంటాననిన వారెవరో కనిపెడతానని అంటాడు. తన తల్లిని తనకు కాకుండా చేసి గుండెకోత మిగిల్చినవాడు ఈ భూమి మీద ఉండకుండా చేస్తానని అంటాడు.
తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం, తన తల్లిని లేకుండా చేసిన వాడిని పట్టుకోవడం ఇవే తనకున్న రెండు బాధ్యతలని ఆవేశంగా మాట్లాడతాడు. దేవయాని, శైలేంద్ర కంగారు పడతారు. ఆ తరువాత ఏం జరిగింది? నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాలి. గుప్పెడంత మనసు సీరియల్ లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రామ్ ప్రధాన పాత్రల్లో నటస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు.