Bigg Boss 5: ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే?

పదో కంటెస్టెంట్ కూడా ఇంటి నుండి బయటకి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. చూస్తుండగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ లో పదో వారం కూడా పూర్తి అవనుంది. ఈ ఆదివారం మరో కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకి ..

Bigg Boss 5: ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే?

Bigg Boss 5

Updated On : November 13, 2021 / 6:35 PM IST

Bigg Boss 5: పదో కంటెస్టెంట్ కూడా ఇంటి నుండి బయటకి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. చూస్తుండగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ లో పదో వారం కూడా పూర్తి అవనుంది. ఈ ఆదివారం మరో కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకి వచ్చేయనున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో హౌస్‌లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో తొమ్మిది వారాలు తొమ్మిది మందిని బయటకి పంపగా జెస్సీ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా ఈ వారం మరో కంటెస్టెంట్ కూడా బయటకి రావాల్సి ఉంది.

Akhanda: ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ట్రైలర్ వచ్చేస్తుంది!

ఈ వారం కాజల్, సిరి హన్మంతు, యాంకర్ రవి, వీజే సన్నీ, మానస్ లు ఎలిమినేషన్ లో ఉండగా వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే అంటూ సోషల్ మీడియాలో లీకులు కూడా హల్చల్ చేస్తుండడంతో దాదాపుగా ఈవారం మరో లేడీ కంటెస్టెంట్ బయటకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. సహజంగా ఒకరోజు ముందే ఈ షో షూటింగ్ జరగడంతో తొలి వారం నుండే ఈ లీకుల బెడద బిగ్ బాస్ ను వేధిస్తుండగా ఈ వారం కూడా అదే విధంగా లీకైనట్లు తెలుస్తుంది.

Kiara Advani: మొగుడు పెళ్ళాల మధ్యలో వచ్చే నాటీ గర్ల్ ఫ్రెండ్!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఆర్జే కాజల్ బిగ్ బాస్ ఇంటి నుండి బయటకి వచ్చేసినట్లు తెలుస్తుంది. మొదటి నుంచీ ఈమెపై షో ఫాలోవర్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కంటే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ నే ఎక్కువగా ఉంది. అయితే.. ఆర్జేగా మంచి ఫాలోయింగ్ ఉండడం.. ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎస్టాబ్లిష్ అవడం ఇప్పటి వరకు కాజల్ కు కలిసొచ్చాయి. కానీ.. ఇప్పుడు ఉన్నవాళ్ళలో బెస్ట్ సెలెక్షన్ టైం వచ్చేయడంతో కాజల్ ను బయటకి పంపేసినట్లు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో అతి తక్కువ ఓట్స్ తో వెనుకబడి కాజల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.