Roja Re Entry : రోజా ఫుల్ టైం రీ ఎంట్రీ.. సుధీర్ యాంకర్ గా.. రోజా జడ్జిగా.. జగపతిబాబుతో కలిసి రోజా డ్యాన్స్.. ప్రోమో వైరల్..

రోజా మరో షోలో జడ్జిగా వచ్చిందని తెలుస్తుంది.

Roja Re Entry : రోజా ఫుల్ టైం రీ ఎంట్రీ.. సుధీర్ యాంకర్ గా.. రోజా జడ్జిగా.. జగపతిబాబుతో కలిసి రోజా డ్యాన్స్.. ప్రోమో వైరల్..

Roja Re Entry With Sudigali Sudheer Hosting Drama Juniors Show

Updated On : April 7, 2025 / 1:39 PM IST

Roja Re Entry : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా సినిమాలు మానేసిన తర్వాత జబర్దస్త్ లాంటి పలు టీవీ షోలలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ ని కూడా వదిలేసి టీవీ షోలు, సినిమాలు చేయను అని చెప్పింది. కానీ గత ఎన్నికల్లో రోజా ఓడిపోవడంతో పాటు ప్రభుత్వం మారడంతో రోజా మళ్ళీ టీవీ షోలలోకి వస్తుంది.

ఇటీవల రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లో ఒక ఎపిసోడ్ కి వచ్చి అలరించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ టీవీ షోలకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూసారు. ఇప్పుడు రోజా మరో షోలో జడ్జిగా వచ్చిందని తెలుస్తుంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ మొదలు కానుంది. తాజాగా ఈ సీజన్ ప్రోమో రిలీజ్ చేసారు.

Also Read : Ashu Reddy – Pawan Kalyan : పవన్ గారు పిలిచి టీ ఇచ్చి.. నేను అన్న మాటకు పడీ పడీ నవ్వారు.. వెళ్ళేటప్పుడు వార్నింగ్ కూడా.. అషురెడ్డి వ్యాఖ్యలు వైరల్..

డ్రామా జూనియర్స్ షోలోకి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ ఈ షోకి యాంకర్ గా చేస్తున్నాడు. రోజాతో పాటు ఆమని, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ షో ఓపెనింగ్ ఎపిసోడ్ కి జగపతి బాబు రాగా ఆయనతో కలిసి రోజా, ఆమని డ్యాన్స్ వేసి అలరించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. డ్రామా జూనియర్స్ షోతో రోజా మళ్ళీ టీవీ షోలలో బిజీగా మారబోతుంది. మరి మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి.

రోజా రీ ఎంట్రీ ప్రోమో మీరు కూడా చూసేయండి..