Roopa Koduvayur : వెండితెరపై దూసుకొస్తున్న మరో తెలుగమ్మాయి.. రూప కొడువాయూర్ కి అవకాశాలు వెల్లువ

రూప కొడువాయూర్ పేరు ఏదో మలయాళి అమ్మాయిలా ఉన్నా అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ.

Roopa Koduvayur : వెండితెరపై దూసుకొస్తున్న మరో తెలుగమ్మాయి.. రూప కొడువాయూర్ కి అవకాశాలు వెల్లువ

Roopa Koduvayur Telugu Girl getting offers in Tollywood Impressing with her acting and dance

Roopa Koduvayur : ఇటీవల మన సినీ పరిశ్రమలో హీరోయిన్స్ గా తెలుగమ్మాయిలు వస్తున్నారు. చాలామంది తెలుగమ్మాయిలు టాలీవుడ్(Tollywood) వెండితెరకు పరిచయమై సక్సెస్ అవుతున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు మరో తెలుగమ్మాయి సక్సెస్ అవుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

రూప కొడువాయూర్ పేరు ఏదో మలయాళి అమ్మాయిలా ఉన్నా అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ. పేరులోనే కాదు రూపంలో కూడా అందమే. చక్రాల్లాంటి కళ్లతో , బుగ్గలపై డింపుల్స్ తో, చందమామ నవ్వినంత స్వచ్చంగా కనిపిచ్చే ఈ అమ్మాయి వెండితెరపై అలరిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో క్లాసికల్ డ్యాన్స్ ను నేర్చుకుంది. తరువాత ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరీత్య డాక్టర్ అయిన రూప తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన రూప నేటీవ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. తన మొదటి సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయినప్పటికి అది మంచి విజయం సాధించడంతో తన నటనా ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అలాగే మరోవైపు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంది.

ఇక ఇటీవలే హీరో సోహెల్ జోడిగా రూప కొడువాయూర్ మిస్టర్ ప్రగ్నెంట్ సినిమాలో నటించి మెప్పించింది. సరదాగా నవ్విస్తూ మరోవైపు ఎమోషనల్ క్యారెక్టర్ కూడా చేసింది. ఈ సినిమా కూడా విజయం సాధించడంతో రూపకి మరింత ప్లస్ అయింది. ఇక తన అందంతో సోషల్ మీడియాలో అభిమానులని కూడా పెంచుకుంటుంది రూప.

బేసిగ్గా తను క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సూనసాయంగా నటించగలదు. అద్భుతమైన హవభావాలు పలికిస్తుంది. అదే తనకు ప్లస్ అయింది. అందుకే స్క్రీన్లో తాను ఎంత సమయం ఉన్నా అలా చూస్తూ ఉండిపోతాము. ఎంత మంది ఉన్నా రూప ప్రత్యేకంగా కనిపిస్తుంది. మంచి అవకాశలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రూప కొడవయూర్ లీడ్ రోల్ లో నటించిన ఒక యాక్షన్ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ డిసెంబర్లో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదలకు ముస్తాబు అవుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అవుతుందని సమాచారం. లగే రూప చేతిలో మరో కమర్షియల్ సినిమా కూడా ఉన్నట్టు సమాచారం.

Roopa Koduvayur : మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ప్రమోషన్స్ లో రూప కొడువయుర్..

ఇటీవల తెలుగమ్మాయిలు వరుసగా వస్తున్న సమయంలో తెలుగు అమ్మాయిలను పరిశ్రమకు ఆహ్వానించే దర్శక నిర్మాతలకు రూప కొడువాయూర్ ఒక మంచి సెలక్షన్ అని చెప్పవచ్చు. ఒక పెద్ద సినిమా పడితే కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. చూడాలి మరి రూప కొడువాయూర్ ఇంకెలాంటి సినిమాలతో వస్తుందో. ఓ పక్కన ఇలా వరుస సినిమాలు చేస్తూనే రూప మరోపక్క లండన్ లో MD(Doctor Of Medicine) చేయడానికి కూడా సన్నద్దం అవుతుంది.