RRR For Oscars: సెప్టెంబర్ 30న ‘ఆర్ఆర్ఆర్’కు అగ్నిపరీక్ష..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆస్కార్ అవార్డులకు ఎంపికవుతుందని అందరూ భావించారు. కానీ, భారత ప్రభుత్వం మాత్రం ఆర్ఆర్ఆర్‌ను పక్కనబెట్టి ఓ గుజరాతీ మూవీని ఆస్కార్‌కు నామినేట్ చేసింది.

RRR For Oscars: సెప్టెంబర్ 30న ‘ఆర్ఆర్ఆర్’కు అగ్నిపరీక్ష..?

RRR For Oscars Academy Members To Watch RRR Show

RRR For Oscars: టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయగా, వసూళ్ల పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లింది.

RRR For Oscars: “ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్”.. ఇంకా ఛాన్స్ ఉంది!

ఇక ఈ సినిమాను ఓటీటీలో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ చేయడంతో, ఈ చిత్రం గ్లోబల్‌గా విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ క్రేజ్ కారణంగానే ఈ మూవీ ఆస్కార్ అవార్డులకు ఎంపికవుతుందని అందరూ భావించారు. బెస్ట్ యాక్టర్స్‌గా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు, బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, భారత ప్రభుత్వం మాత్రం ఆర్ఆర్ఆర్‌ను పక్కనబెట్టి ఓ గుజరాతీ మూవీని ఆస్కార్‌కు నామినేట్ చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎలాగైనా ఆస్కార్‌కు పంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

RRR For Oscars: “RRR”ను ఆస్కార్ రేస్‌లో నుంచి తప్పించిన భారత ప్రభుత్వం.. రాజకీయం అంటున్న నెటిజెన్లు!

ఈ క్రమంలోనే యూఎస్ డిస్ట్రిబ్యూటర్ అయిన వేరియన్స్ పిక్చర్స్, ఆస్కార్ అకాడెమీ సభ్యులకు ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 30న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అకాడెమీ సభ్యులకు ప్రత్యేక షో ద్వారా చూపంచనున్నారు. ఆ రోజున ఆర్ఆర్ఆర్ చిత్రానికి అగ్నిపరీక్షగా నిలవబోతుందని పలువురు అంటున్నారు. మరి సెప్టెంబర్ 30న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసి, అకాడెమీ సభ్యులు ఈ సినిమాను ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది.