RRR: ఓటీటీలో ట్రిపుల్‌ఆర్.. ఎప్పుడు.. ఎక్కడంటే?
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. గురువారం అర్ధరాత్రి నుండే మొదలైన షోలు.. యూఎస్ ప్రీమియర్స్ దెబ్బతో..

Rrr Etthara Jenda
RRR: ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. గురువారం అర్ధరాత్రి నుండే మొదలైన షోలు.. యూఎస్ ప్రీమియర్స్ దెబ్బతో గురువారం రాత్రి నుండే మొదలైన హంగామా కొనసాగుతూనే ఉంది. దేశంలోని అన్ని బాషల నుండి ఇతర దేశాల వరకు ఎక్కడ చూసినా ఒక్కటే టాక్.. బొమ్మ సూపర్ హిట్. సినిమా చూసిన అందరూ ముక్తకంఠంతో చెప్పే మాట.. ఫైనల్ గా అందరి నుండి యూనానిమస్ రెస్పాన్స్.. బొమ్మ దద్దరిల్లిందంతే.
RRR: బాహుబలి 2 రికార్డు బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్
మూడేళ్ళ నుండి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. ఆ అంచనాలకు తగ్గట్లే ఇప్పుడు ఆల్ ఓవర్ గా రెస్పాన్స్ అందుకోవడంతో జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ పడ్డట్లే కనిపిస్తుంది. అన్ని భాషల్లో సినీ విమర్శకులు, ప్రముఖులు నుండి వస్తున్న ఇదే రెస్పాన్స్ తో ఈ సినిమా ఓపెనింగ్స్ రూ.200 కోట్లు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాల్సి ఉండగా.. పనిలో పనిగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ అంశంలో కూడా క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తుంది.
RRR: థియేటర్ సిబ్బంది-ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం.. ఫ్యాన్స్‌పై దాడి?
గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదలయ్యే అవకాశం ఉందని వినిపించింది. ఇప్పుడు వాటికే డిజిటల్ రైట్స్ దక్కినట్లు తెలుస్తుంది. సౌత్ లాంగ్వేజెస్ వరకు జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంటే, హిందీతోపాటు ఇతర భాషలైన ఇంగ్లీష్, పోర్చుగల్, కొరియన్, టర్కీష్, స్పానిష్ భాషలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇక, సినిమా విడుదలయ్యాక 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనే కండీషన్ కూడా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే జూన్‌లో సినిమా ఓటీటీలోకి రానుంది. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాల్సి ఉంది.