RRR: బాహుబలి 2 రికార్డు బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్

నేడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియాతో సినిమా లవర్స్ ఊగిపోతున్నారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు.....

RRR: బాహుబలి 2 రికార్డు బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్

Rrr Breaks Baahubali 2 Records In Usa

RRR: నేడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియాతో సినిమా లవర్స్ ఊగిపోతున్నారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు చేరుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలు షోలు పడగా, ఓవర్సీస్‌లో ఈ సినిమాను నిన్న ప్రీమియర్ షోలుగా వేశారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఎవరి ఊహలకు అందకుండా భారీ విజయంవైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా బాహుబలి 2 చిత్రం క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పటివరకు ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది. కానీ ఓ చోట మాత్రం ఏకంగా బాహుబలి 2 చిత్రం క్రియేట్ చేసిన రికార్డును సైతం బద్దలు కొట్టింది ఈ ప్రెస్టీజియస్ మూవీ.

RRR: తారక్‌కు లేని టెన్షన్.. చెర్రీకి ఎందుకు?

యూఎస్ఏలో బాహుబలి 2 చిత్రం ప్రీమియర్స్‌లో ఏకంగా 2.5 మిలియన్ డాలర్ల వసూలుతో చరిత్ర సృష్టించింది. ఆ తరువాత వచ్చిన పలు సినిమాలు ఈ రికార్డును బ్రేక్ చేస్తాయని పలువురు భావించినా బాహుబలి 2 చిత్ర రికార్డును మాత్రం తాకలేకపోయాయి. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రీమియర్స్ రూపంలో ఏకంగా 3 మిలియన్ డాలర్ల సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజే ఇంత భారీ వసూళ్లు రావడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ సినిమావైపే చూస్తోంది.

ఇక అమెరికాలో ఏకంగా 981 ప్రాంతాల్లో RRR ప్రీమియర్ షోలు పడ్డాయని తెలుస్తోంది. అటు యుకేతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ వీకెండ్‌లోగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక తొలిరోజే అమెరికాలో ప్రీమియర్ల ద్వారా రూ.22 కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును తన పేరిట వేసుకుంది.

RRR: థియేటర్ సిబ్బంది-ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం.. ఫ్యాన్స్‌పై దాడి?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించగా, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ ప్రెస్టీజియస్ మూవీని డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.