RRR: ఆస్కార్ బరిలో “RRR”.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "RRR" దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంతటి ప్రజాధారణ పొందిన చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ, భారత ప్రభుత్వం గుజరాతీ మూవీని ఆస్కార్స్ కు నామినేట్ చేసింది.

RRR Movie in Oscar Race
RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “RRR” దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంతటి ప్రజాధారణ పొందిన చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ, భారత ప్రభుత్వం గుజరాతీ మూవీని ఆస్కార్స్ కు నామినేట్ చేసింది.
RRR Naatu Naatu Song: నాటు నాటు ఇంగ్లీష్ వర్షన్ చూశారా..?
దీంతో RRR ఆస్కార్ కలలు చెరిగిపోయిని అని అందరూ నిరాశపడ్డారు. కానీ ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం.. ఏ సినిమైనా ‘లాస్ ఏంజెల్స్’లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వారం పాటు ప్రదర్శించబడితే చాలు. ఆ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలవచ్చు. ఈ క్రమంలో మూవీ టీమ్ “For Your Consideration” కింద 15 విభాగాల్లో “ఆర్ఆర్ఆర్”ను నామినేట్ చేసింది..
‘బెస్ట్ మోషన్ పిక్చర్’, ‘బెస్ట్ డైరెక్ట్ర్’, ‘బెస్ట్ యాక్టర్'(ఎన్టీఆర్ & రామ్ చరణ్), ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్'(అజయ్ దేవగన్), ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్'(ఎం. ఎం. కీరవాణి).. ఇలా 15 విభాగాల్లో క్యాంపెయిన్ చేస్తున్నట్లు రాజమౌళి తనయడు కార్తికేయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ వార్త విన్న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
❤️?? #RRRforOscars https://t.co/83MUH5QuMH
— S S Karthikeya (@ssk1122) October 6, 2022