RRR Movie : ఆరోజు ఏం చెప్పబోతున్నారబ్బా?

‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన అక్టోబర్ 29న అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది..

RRR Movie : ఆరోజు ఏం చెప్పబోతున్నారబ్బా?

Rrr Movie

Updated On : October 27, 2021 / 7:06 PM IST

RRR Movie: బిగ్ డే.. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అంటూ మూవీ లవర్స్ అండ్ ఆడియన్స్‌ను మరోసారి సర్‌ప్రైజ్‌కి గురి చేశారు జక్కన్న అండ్ టీం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ కనిపించనున్నారు.

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

అలియా భట్, ఒలీవియా మోరిస్‌హీరోయిన్స్ కాగా అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది ‘ఆర్ఆర్ఆర్’. 2:45 గంటల నిడివితో ఫైనల్ కట్ ప్రిపేర్ చేశారు జక్కన్న.

RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

అయితే సంక్రాంతికి మరికొన్ని పెద్ద సినిమాలు విడుదల కాబోతుండడం, పండక్కి కేవలం వారం రోజుల ముందు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అంటూ సడెన్‌గా ప్రకటించడంతో సినిమా విడుదల వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ఓ అప్‌‌డేట్ ఇచ్చారు టీం.
అక్టోబర్ 29న ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడని, వినని ఒక కొలాబ్రేషన్‌ని చూడబోతున్నారు. ఇదొక సెన్సేషన్ అవుతుంది. ఆ రోజు ‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు టీం.