RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!

సౌత్ ఇండియాలోనే కాదు .. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ గా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు మిగతా..

RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!

Rrr

RRR: సౌత్ ఇండియాలోనే కాదు .. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ గా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు మిగతా సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డుల్ని సెట్ చేస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తుంటే.. ఎలా ఆడియన్స్ ని ఆకట్టుకోవాలా..? ఎంతలా సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేద్దామా అని సరికొత్త ప్లాన్లతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు ట్రిపుల్ఆర్ టీమ్.

RRR: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ.. అసలు ఉంటుందా?

ఇంకో వారంలో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది ట్రిపుల్ఆర్. జనవరి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఫాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కు వారం ఉన్నా.. ఈ సినిమా టీమ్ చేసే సందడి చూడ్డానికి అంత వరకూ ఆగక్కర్లేదు. నేషనల్ వైడ్ గా ప్రమోషన్లు చేస్తున్న ట్రిపుల్ఆర్.. ఇయర్ ఎండ్ కి కూడా గ్రాండ్ గా ప్రోగ్రామ్స్ ఎరేంజ్ చేసింది.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎరేంజ్ చేసిన ట్రిపుల్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి వీడియో లు రిలీజ్ చెయ్యని టీమ్.. ఈ ప్రోగ్రామ్ ని ఇయర్ ఎండ్ కి టెలికాస్ట్ చేస్తోంది. అంతేకాదు.. ఫేమస్ నేషనల్ ఛానల్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ.. కొత్త సంవత్సరంలో సందడి చెయ్యబోతున్నాయి. నార్త్ లో ఫేమస్ అయిన కపిల్ శర్మ షో కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలు ఇప్పటికే విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి.

Liger: ఓ రేంజ్ ప్రమోషన్లు.. రౌడీ హీరో బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్!

ట్రిపుల్ఆర్ సందడి బాలీవుడ్ నుంచి సౌత్ వచ్చేసింది. మొన్నటి వరకూ బ్రేక్ లేని ఇంటర్వ్యూస్ తో బిజీగా ఉన్న ట్రిపుల్ఆర్ టీమ్.. అటు తమిళ్ తో పాటు.. మళయాళ ఆడియన్స్ ని కూడా ఫుల్ ఫిదా చేసేశారు. ఈ ఈవెంట్ లో కూడా తమమధ్య బాండింగ్ కి ఓపెన్ గా ఎక్స్ ప్రెస్ చేశారు చరణ్-ఎన్టీఆర్. మరో వైపు రాజమౌళి.. ఈ సినిమా మనిషైతే.. అజయ్ దేవ్ గన్ ఆత్మ అని, నీరు-నిప్పు లాంటి ఇద్దరు ఫోర్స్ ఫుల్ పీపుల్స్ ని బ్యాలెన్స్ చేసే అద్బుత మైన క్యారెక్టర్ ఆలియా అని ట్రిపుల్ఆర్ మీద రోజురోజకీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు.