RRR: ప్రమోషన్స్.. భీమ్-రామ్ మేకింగ్ వీడియోలు వైరల్!

ఎప్పుడెప్పుడా అని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది.నిత్యం సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఉండేలా చూసుకుంటూ అభిమానులకు..

RRR: ప్రమోషన్స్.. భీమ్-రామ్ మేకింగ్ వీడియోలు వైరల్!

Rrr

Updated On : December 21, 2021 / 12:13 PM IST

RRR: ఎప్పుడెప్పుడా అని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది. నిత్యం సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఉండేలా చూసుకుంటూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన జక్కన అండ్ కో ముంబైలో నార్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పూర్తిచేసి ఉత్తరాది జనాల్లో సినిమా మీద అంచనాలను ఊగించని స్థాయికి చేర్చేశాడు. ముంబై ఈవెంట్ ఇప్పటికీ ప్రసారం చేయకుండా నెలాఖరున ఇది బయటకి వదలనున్నారు.

Malavika Mohanan: కట్టు జారిపోతా ఉంది హొయ్.. చీరకట్టు జారిపోతా ఉంది!

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు. ఈ వీడియోలలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ మేకోవర్.. గోండ్రు బొబ్బిలి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మారిన తీరును చూపించారు. ట్రైలర్ లో వీరిద్దరి వీరోచిత పోరాటాలు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఈ స్టార్ హీరోలు ఎంతగా కష్టపడ్డారో ఈ మేకింగ్ వీడియోలో శాంపిల్ చూపించారు. అల్లూరిగా చరణ్ కష్టపడ్డ తీరు, తారక్ భీమ్ లా మారిన విధానం ఆకట్టుకొంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Bajrangi Bhaijaan 2: టాలీవుడ్ మీద కన్నేసిన సల్మాన్.. తెలుగు రైటర్‌తో మరో సినిమా!

అదే సమయంలో షూటింగ్ సెట్ లో చరణ్, తారక్ ల సందడి, రాజమౌళి సీన్స్ వివరించడం కనిపించాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఇన్ స్టాగ్రామ్ ఖాతాలలో షేర్ చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఎక్కడా సినిమా మీద హైప్ తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్న టీమ్ త్వరలోనే తెలుగుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించే ఏర్పాట్లు చేస్తుండగా.. మరి జనవరి 7న ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)