RRR : గోండు బెబ్బులిగా తారక్ నటవిశ్వరూపం..

RRR – Bheem Intro: తారక్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 5 నెలల ఎదురుచూపులకు తెరపడింది. యంగ్ టైగర్ NTR కొమరం భీమ్, మెగా పవర్ స్టార్ Ram Charan లను అల్లూరి సీతారామరాజు పాత్రల్లో చూపిస్తూ దర్శకధీరుడు SS Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘‘#RRR- రౌద్రం రణం రుధిరం’’..
అక్టోబర్ 22న కొమరం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ టీజర్ విడుదల చేశారు. నాలుగు భాషల్లో రామ్ చరణ్ వాయిస్ ఆకట్టుకుంది. తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్ గా తారక్ వెండితెరపై విజృంభించనున్నాడని హింట్ ఇచ్చిందీ టీజర్.. జక్కన్న టేకింగ్.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్.. సెంథిల్ ఫొటోగ్రఫి&సీజీ, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతీది హైలెట్ అనే చెప్పాలి.